Telugu News » Nithika Panth : తొలిసారి టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా మహిళ నియామకం..!

Nithika Panth : తొలిసారి టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా మహిళ నియామకం..!

పోలీసు శాఖలో టాస్క్‌ఫోర్స్ కీలకమైనది. అంతటి కీలకమైన టాస్క్‌ఫోర్స్‌కు డీసీపీగా ఓ మహిళ నియామకం ఇదే తొలిసారి కావటం విశేషం.. తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. కీలక మైన టాస్క్‌ఫోర్సులో ఎక్కువ కాలంగా పని చేస్తున్న రాధాకిషన్‌‌ రావుపై ఈసీ చర్యలు తీసుకోవడానికి కారణం సీఎం కేసీఆర్ కుటుంబానికి రాధాకిషన్ రావు సన్నిహితడవడం వల్ల అని గుసగుసలు వినిపిస్తున్నాయి..

by Venu

తెలంగాణ (Telangana)లో పలువురు అధికారులను ఈసీ (EC) ఇప్పటికే బదిలీ చేసింది. కాగా ఆయా స్థానాల్లో కొత్తవారిని నియమించే పక్రియకు శ్రీకారం చుట్టిన సీఎస్ (CS) ఇదివరకే కొందరికి పోస్టింగ్ ఆర్డర్లు కూడా ఇచ్చారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) వేళ అధికారుల బదిలీ విషయం పై తెలంగాణలో జోరుగా చర్చలు కూడా సాగుతున్నాయని సమాచారం. తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ శుక్రవారం సాయంత్రం సీఎస్ శాంతి కుమారి (Shanti Kumari) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపధ్యంలో టాస్క్‌‌ఫోర్స్‌‌ డీసీపీ రాధాకిషన్ రావు ( DCP Radhakishan)పై కూడా వేటు పడింది. పదవీ విరమణ పొంది నాలుగేండ్లు గడిచినా బాధ్యతలు నిర్వహిస్తుండడంపై ఈసీ సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఈసీ గైడ్‌‌లైన్స్‌‌ ప్రకారం సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

ఈయన స్థానంలో 2017 బ్యాచ్ కు చెందిన నితికా పంత్‌ (Nithika Panth)‌ ఐపీఎస్‌‌ను నియమించారు. కాగా ప్రస్తుతం సైబరాబాద్ ఉమెన్ సేప్టీ డీసీపీగా నితికా పంత్‌ ఉన్నారు. మరోవైపు పోలీసు శాఖలో టాస్క్‌ఫోర్స్ కీలకమైనది. అంతటి కీలకమైన టాస్క్‌ఫోర్స్‌కు డీసీపీగా ఓ మహిళ నియామకం ఇదే తొలిసారి కావటం విశేషం..

తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. కీలక మైన టాస్క్‌ఫోర్సులో ఎక్కువ కాలంగా పని చేస్తున్న రాధాకిషన్‌‌రావు పై ఈసీ చర్యలు తీసుకోవడానికి కారణం.. సీఎం కేసీఆర్ కుటుంబానికి రాధాకిషన్ రావు సన్నిహితడవడం వల్ల అని గుసగుసలు వినిపిస్తున్నాయి..

You may also like

Leave a Comment