రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల(Telangana assembly elections) నేపథ్యంలో బీఆర్ఎస్(Brs) తన అమ్ముల పొదలోని అస్త్రాలను సంధించడానికి సిద్ధమైంది. ఈ మేరకు.. హైదరాబాద్(Hyderabad)లోని జలవిహార్‌లో వార్‌రూమ్ ఇన్ఛార్జిలతో సమావేశాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(Ktr), మంత్రి హరీశ్‌రావు(Harishrao)లు పాల్గొని ప్రసంగించారు.
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల వార్‌రూమ్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఎన్నికల సన్నదతలో భాగంగా క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ అన్ని రకాలుగా సమాయత్తం అయ్యేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు.
మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. మూడోసారీ కేసీఆర్ అధికారంలోకి రాబోతున్నారని సర్వేలు చెప్తున్నాయన్నారు. సీరియస్‌గా నెల రోజులు కష్టపడాలని కార్యకర్తలకు సూచించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజలకు సోషల్ మీడియా ద్వారా పేపర్ల ద్వారా, ప్రతి ఇంటికి స్టిక్కర్ అతికించాలని, డోర్ టు డోర్ ఈ కార్యక్రమం జరగాలని సూచించారు.
అదేవిధంగా మేనిఫెస్టో అంశాలపై రోజూ మీడియాతో మాట్లాడాలన్నారు. లోకల్ కేబుల్ టీవీ నెట్‌వర్క్‌ల్లో సైతం మాట్లాడాలని సూచించారు. సీఎం సభ జరిగే ప్రదేశాల్లో మేనిఫెస్టో అంశాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు.మేనిఫెస్టో హామీలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొంత వెనుక బడుతున్నారని కార్యకర్తలకు మొట్టికాయవేశారు.
2009 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటి అమలు చేయలేదని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై మైండ్‌గేమ్ ఆడుతుందని, విమర్శలను తిప్పి కొట్టి బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజలకు తెలియజేయాలన్నారు. కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాల్లో కరెంట్ కోతలు ఎలా ఉన్నాయో ప్రజలకు తెలపాలని బీఆర్ఎస్ క్యాంపెయినర్స్, వార్ రూమ్ ఇన్‌చార్జీలకు హరీశ్‌రావు తెలిపారు.