Telugu News » Errabelli Dayakar rao: రేవంత్ ఒక బ్రోకర్, ఒక చీటర్.. సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి ఎర్రబెల్లి..!?

Errabelli Dayakar rao: రేవంత్ ఒక బ్రోకర్, ఒక చీటర్.. సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి ఎర్రబెల్లి..!?

రేవంత్ ఎక్కడ కాళ్లు పెడితే అక్కడ పార్టీ నాశనం అయిపోతుందని ఎర్రబెల్లి విమర్శించారు. కాంగ్రెస్ గిరిజన యూనివర్సిటీ ఇస్తామని.. సమ్మక సారక్కకు జాతీయ హోదా కల్పిస్తామని చెప్పి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

by Venu

తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల్లో (assembly elections) భాగంగా మహబూబాబాద్ (Mahbubabad)జిల్లాలో కేసీఆర్ (KCR) ఈ నెల 27 న నిర్వహించే బహిరంగ సభ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఏర్పాట్లను పరిశీలించడానికి వెళ్ళిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar rao).. అనంతరం కాంగ్రెస్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. టీపీసీసీ రేవంత్ రెడ్డి ఒక బ్రోకర్, ఒక చీటర్ అని ఫైర్ అయ్యారు.

రేవంత్ ఎక్కడ కాళ్లు పెడితే అక్కడ పార్టీ నాశనం అయిపోతుందని ఎర్రబెల్లి విమర్శించారు. కాంగ్రెస్ గిరిజన యూనివర్సిటీ ఇస్తామని.. సమ్మక సారక్కకు జాతీయ హోదా కల్పిస్తామని చెప్పి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు భూపాలపల్లికి, ములుగుకి కాంగ్రెస్ వాళ్ళు చేసింది శూన్యం అని మంత్రి ఎర్రబెల్లి మండిపడ్డారు.

బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతామన్న కాంగ్రెస్ అది కూడా చేయలేదు కానీ మాటలతో కోటలు కడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇవేమీ చేయకుండా రాహుల్ గాంధీ.. రేవంత్ రెడ్డి రాసిన స్క్రిప్ట్ చదువుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ ఖాయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పేదలకు సీఎం కేసీఆర్ అందిస్తున్న పథకాలు ఆయనకు శ్రీరామ రక్షగా నిలుస్తాయని.. కేసీఆర్ మూడోసారి పదవిలోకి రావడం ఖాయమని ఎర్రబెల్లి దయాకర్ తెలిపారు.

You may also like

Leave a Comment