తెలంగాణ (Telangana) నేతల మధ్య మాటల యుద్ధం జెట్ స్పీడ్ వేగంతో దూసుకుపోతుంది. ఎవరు ఎప్పుడు ఏ విషయంలో ఆరోపణలు చేసుకుంటారో !.. ఊహకు అందని విధంగా విమర్శించుకుంటారో ! అని ప్రజలు అనుకుంటున్నారు. ఇదంతా ఎన్నికలు అయ్యే వరకే అని మరికొందరు మాట్లాడుకుంటున్నారు. ఎన్నికల వరకు తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కానీ.. ప్రస్తుతం అయితే మాటలతో ఎన్నికల వేడిని సృష్టిస్తున్నారు తెలంగాణ నేతలని అంతా ముచ్చటించుకుంటున్నారు.
ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లా సాగుతోంది. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకొంటున్నారు. అయితే తాజాగా కాంగ్రెస్ నేత మాజీ మంత్రి జానారెడ్డి ( Jana Reddy) మంత్రి కేటీఆర్ ( Minister KTR)కి సంస్కారం లేదని విమర్శించారు. రాహుల్ గాంధీ గురించి సంస్కారం లేకుండా.. కేటీఆర్ మాట్లాడటం ఆయన కుటిల బుద్ధికి నిదర్శమని జానా అన్నారు..
పేదల ప్రభుత్వం అని చెప్పుకొంటున్న బీఆర్ఎస్ ( BRS) పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసిందా..? దళితులకు భూమి ఇచ్చారా? అని జానారెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ (Congress) పార్టీ కరెంట్ ఉత్పత్తికి కృషి చేస్తే.. ఆయన ఏదో కరెంట్ కోసం సత్యాగ్రహం చేసినట్టు మాట్లాడటం విడ్డూరమని జానారెడ్డి ఎద్దేవా చేశారు.ఏ పదవి లేకుండా 60 ఏళ్లు స్వాతంత్ర్యం కోసం కొట్లాడిన కాంగ్రెస్ గురించి.. ఓనమాలు కూడా సరిగ్గా తెలియని కేటీఆర్ మాట్లాడటం పులికి, నక్క నీతులు చెప్పినట్టు ఉందని జానారెడ్డి ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ లేకుంటే తెలంగాణ రాకపోయేదని కేసీఆర్ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకో కేటీఆర్ అని జానారెడ్డి అన్నారు. సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే దేవత అన్నారు. ఇప్పుడు దెయ్యం అనడం మీ అహంకారానికి అద్దం పడుతోందని జానారెడ్డి విమర్శించారు. ఇక బీఆర్ఎస్ ( BRS)పార్టీ హయాంలో తలసరి ఆదాయం పెరిగింది అంటు గొప్పలు చెప్పుకొంటున్న మీకు 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ హయాంలో 6.5 శాతం పెరిగిన తలసరి ఆదాయం కనిపించడం లేదా అని జానారెడ్డి ప్రశ్నించారు..
మరోవైపు బీఆర్ఎస్ ( BRS)నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అప్పులు చేశారని విమర్శించడం విడ్డూరం అన్న జానారెడ్డి బీఆర్ఎస్ ( BRS) ప్రభుత్వం 5 లక్షల 50 వేల కోట్ల అప్పు చేయలేదా అంటూ ప్రశ్నించారు. మేడిగడ్డ పై పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత మాట్లాడతా అని జానా అన్నారు.. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించి.. బీఆర్ఎస్ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధమయ్యారని మంత్రి కేటీఆర్‌పై జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.