Telugu News » Revuri Prakash Reddy : బీజేపీని వీడనున్న కీలక నేత.. కాంగ్రెస్‌లోకి ముహూర్తం ఖాయం..!!

Revuri Prakash Reddy : బీజేపీని వీడనున్న కీలక నేత.. కాంగ్రెస్‌లోకి ముహూర్తం ఖాయం..!!

నర్సంపేట స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు రేవూరి ప్రకాష్ రెడ్డి గత కొంత కాలంగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. అది వర్కవుట్ కాకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు తాను పరకాల నుంచి పోటీ చేయనున్నట్టు మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రకటించారు.

by Venu

తెలంగాణలో (Telangana) ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీ మారే నేతలు రోజు రోజుకి పెరిగి పోతున్నారు. ఇదే దారిలో ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి (Revuri Prakash Reddy) పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. బీజేపీని వీడి, అక్టోబర్ 18న ములుగులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సభ సందర్భంగా.. ఆయన సమక్షంలోనే కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్టు తెలుస్తోంది.

కాగా నర్సంపేట స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు రేవూరి ప్రకాష్ రెడ్డి గత కొంత కాలంగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. అది వర్కవుట్ కాకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు తాను పరకాల నుంచి పోటీ చేయనున్నట్టు మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రకటించారు. రేపు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలిపారు. రేవూరి మీడియాతో మాట్లాడుతూ గత 4 నెలలుగా బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని, గ్రూప్ పాలిటిక్స్ పెరిగి, ఏకాభిప్రాయం కుదరడం లేదన్నారు..

అయితే బీజేపీ బండి సంజయ్ ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి సెల్ఫ్ గోల్ వేసుకుందని విమర్శించారు. ఇకపోతే టీడీపీ హయాం నుంచి రేవూరి ప్రకాశ్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలక నేతగా కొనసాగుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత మారిన రాజకీయాల నేపథ్యంలో కొన్నేళ్ల కిందట ఆయన బీజేపీలో చేరారు. తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే.. రేవూరి పరకాల నుంచి పోటీ చేస్తే, ఇప్పటికే పరకాలపై ఆశలు పెట్టుకున్న కొండా మురళి, ఇనుగాల వెంకట్రామిరెడ్డి పరిస్థితి ఏంటనేది రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.

You may also like

Leave a Comment