Telugu News » Prime Minister Of Bharat:ప్రెసిడెంట్ ఆఫ్‌ భారత్‌ కాదు..ప్రైమ్‌ మినిస్టర్‌ ఆఫ్‌ భారత్‌!

Prime Minister Of Bharat:ప్రెసిడెంట్ ఆఫ్‌ భారత్‌ కాదు..ప్రైమ్‌ మినిస్టర్‌ ఆఫ్‌ భారత్‌!

‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా’’కు బదులుగా ‘‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్’’గా పేర్కొన్నారు.

by Sai
a-note-on-narendra-modis-visit-to-indonesia-refers-to-him-as-the-prime-minister-of-bhara

కేంద్రం ‘ఇండియా’ పేరును ‘భారత్’గా మారుస్తుందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీనికి బలం చేకూరుస్తూ.. నిన్ని జీ20 విందు ఆహ్వానంలో ‘ప్రెసిడెండ్ ఆఫ్ ఇండియా’ బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ప్రచురించడం ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. సెప్టెంబర్ 18-22 మధ్య జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ పేరు మార్పుపై బిల్లు ప్రవేశపెడతారని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు కేంద్రం చర్యలను కాంగ్రెస్, ఆప్, టీఎంసీ పలు పార్టీలు విమర్శిస్తున్నాయి.

a-note-on-narendra-modis-visit-to-indonesia-refers-to-him-as-the-prime-minister-of-bhara

ఇదిలా ఉంటే తాజాగా అగ్నికి ఆజ్యం తోడైనట్లుగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ 20వ ఆసియాన్-ఇండియా సమ్మిట్ మరియు 18వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు కోసం బుధ, గురువారాల్లో ఇండోనేషియా పర్యటనకు వెళ్లననున్నారు. దీనికి సంబంధించిన పత్రంలో ‘‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా’’కు బదులుగా ‘‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్’’గా పేర్కొన్నారు. దీంతోొ మరోసారి ఇండియా పేరు భారత్ గా మారుతుందనే ఊహాగానాలు బలపడ్డాయి.

బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఈ ఆహ్వానానికి సంబంధించిన నోట్ ను ఎక్స్(ట్విట్టర్)లో పంచుకున్నారు. ఇందులో ‘ఆసియాన్-ఇండియా సమ్మిట్’తో పాటు ‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా’ అని కూడా ఉంది. మరోవైపు కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ట్విట్టర్ పోస్టులు ‘‘ మోడీ ప్రభుత్వం ఎంత గందరగోళంలో పడిందో చూడండి..20వ ఆసియాన్-ఇండియా సమ్మిట్‌లో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ప్రతిపక్షాలు కలిసి ఇండియా కూటమి పెట్టుకోవడంతోనే ఇదంతా డ్రామా’ అంటూ వ్యాఖ్యానించారు.

కేంద్రం చర్యలపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ప్రతిపక్షాలు ఇండియా కూటమి పేరును భారత్ గా మార్చుకుంటే, ఆ పార్టీ భారత్ పేరును బీజేపీగా మారుస్తుందా..? ఈ దేశం ఒక్కపార్టీది కాదని 140 కోట్ల మందిదని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మరోవైపు బీజేపీ నేతలు భారత్ అనే పదాన్ని స్వాగతిస్తున్నారు. అస్సాం సీఎం హిమంత బిశ్వసర్మ దీనికి మద్దతు తెలిపారు. బీజేపీ జాతీయాద్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. దేశ ప్రతిష్టతను పెంచే ప్రతీ పనికి కాంగ్రెస్ అడ్డు చెబుతోందని విరుచుకుపడ్డారు.

You may also like

Leave a Comment