Telugu News » India and Bharat: రాజ్యంగంలోనే భారత్ అనే భావన ఉంది: ఎస్ జైశంకర్

India and Bharat: రాజ్యంగంలోనే భారత్ అనే భావన ఉంది: ఎస్ జైశంకర్

ప్రతిపక్ష పార్టీలైతే  మోదీ సర్కార్​ తీసుకుంటున్న ఈ నిర్ణయంపై తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమ కూటమికి ఇండియా అన్న పేరు పెట్టడం వల్ల భయపడి.. ఇలా మార్పు చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

by Prasanna

ఇండియా (India) పేరును భారత్ (Bharat) గా మార్చడంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఇండియా పేరును కేంద్రం ఇక నుంచి భారత్​గా కేంద్రం మార్చేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. దీని కోసం త్వరలో జరగనున్న పార్లమెంట్ (Parliament) ప్రత్యేక సమావేశాల్లో తీర్మానం కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది.  భారత్ గా పేరు మారుస్తామని కేంద్రం ప్రకటించడాన్ని కొందరు సమర్థిస్తుంటే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలైతే  మోదీ సర్కార్​ తీసుకుంటున్న ఈ నిర్ణయంపై తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమ కూటమికి ఇండియా అన్న పేరు పెట్టడం వల్ల భయపడి.. ఇలా మార్పు చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఈ సందర్భంలో ఇండియా పేరు మార్పుపై ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్​ (S Jaishankar) స్పందించారు. జీ20 సమావేశాల నేపధ్యంలో ఆయన మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండియా పేరు మార్పుపై మాట్లాడారు. “ఇండియా అంటేనే భారత్​ అని.. ఆ విషయం రాజ్యాంగంలోనే స్పష్టంగా ఉంది. అందుకోసం ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని చదవాలి. భారత్​ అనే భావనను రాజ్యాంగం సైతం ప్రతిబింబిస్తోంది.” అని జైశంకర్ ఏఎన్​ఐ వార్త సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

పేరు మార్పుపై ఎవరేమన్నారంటే…

పేరు మార్పుపై క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, ముఖ్యమంత్రులు స్టాలిన్, సిద్ధరామయ్యలు తమ స్పందనలు సోషల్ మీడియా వేదకగా వ్యక్తపరిచారు.

‘ఒక పేరు మనలో గర్వాన్ని నింపేదిగా ఉండాలని నేనెప్పుడూ నమ్ముతాను. మనం భారతీయులం. ఇండియా అనే పేరును బ్రిటీష్ వాళ్లు పెట్టారు. దేశ అసలు పేరైన భారత్ ను అధికారికంగా తిరిగి తెచ్చుకునే సమయం వచ్చేసింది. ఈ వన్డే ప్రపంచకప్ లో మన ఆటగాళ్ల ఛాతీపై భారత్ అని ఉండేలా చూసుకోవాలి’ అంటూ బీసీసీఐని, సెక్రటరీ జైషాను ట్యాగ్ చేశారు.

కాగా విపక్షాలు ఇండియా కూటమితో ముందుకు రావడంతోనే బిజెపి ఇండియా పేరును భారత్‌గా మార్చాలని అనుకుంటోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ అన్నారు. ఇండియా అనే ఒక్క పదంతోనే బీజేపీ ఉలిక్కి పడుతోందని, ఇండియా పేరుతో ఏకం కాగానే కాషాయపార్టీ ఇండియా పేరును భారత్‌గా మార్చాలని అనుకుంటోందని స్టాలిన్ ఆరోపించారు.
ఇండియా పేరును దేశం మొత్తం ఆమోదించిందని, ప్రత్యేకంగా భారత్ అని మార్చాల్సిన అవసరం లేదని కర్నాటక ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత సిద్దరామయ్య అన్నారు. రాజ్యాంగంలోనే ఇండియా అంటే భారత్ అని ఉంది. దీన్ని మార్చాల్సిన అవసరం ఉందని తాను అనుకోవడం లేదని ఆయన అన్నారు.

You may also like

Leave a Comment