Telugu News » AAP: ఆప్ ప్రచారం పాటపై నిషేధం.. స్పందించిన అతిషి..!

AAP: ఆప్ ప్రచారం పాటపై నిషేధం.. స్పందించిన అతిషి..!

లోక్‌సభ ఎన్నికల వేళ 'ఆమ్ ఆద్మీ పార్టీ' (AAP)కి భారత ఎన్నికల సంఘం (ECI) షాకిచ్చింది. ఆ పార్టీ ఎన్నికల ప్రచారానికి రూపొందించిన పాటను నిషేధించింది.

by Mano
AAP: Ban on AAP campaign song.. Atishi responded..!

లోక్‌సభ ఎన్నికల వేళ ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ (AAP)కి భారత ఎన్నికల సంఘం (ECI) షాకిచ్చింది. ఆ పార్టీ ఎన్నికల ప్రచారానికి రూపొందించిన పాటను నిషేధించింది. కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన నేపథ్యంలో అరెస్టుకు వ్యతిరేకంగా ఎన్నికల్లో ఆప్‌నకు ఓటు వేయమని ప్రజలను కోరడానికి ఈ పాటను గురువారం న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విడుదల చేశారు.

AAP: Ban on AAP campaign song.. Atishi responded..!

‘జైల్ కే జవాబ్ మే హమ్ వోట్ దేంగే’ అంటూ సాగే ఈ పాటపై తాజాగా ఎన్నికల సంఘం (ఈసీ) నిషేధం విధించింది. అయితే, దీనిపై ఆ పార్టీ నాయకురాలు అతిషి(Athishi) ఆదివారం స్పందించారు. ఈసీ నిర్ణయాన్ని ఆమె తప్పుబట్టారు. ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేయకుండా నియంతృత్వ ప్రభుత్వం అడ్డుకుంటోందని మండిపడ్డారు. బీజేపీ ప్రతీరోజు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తున్నా ఈసీకి కనిపించడంలేదా? అని ప్రశ్నించారు.

ఆప్ నాయకుడు ఊపిరి పీల్చుకున్నా ఈసీ నుంచి నోటీసు వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత కూడా బీజేపీ ఈడీ -సీబీఐని దుర్వినియోగం చేసి కేజ్రీవాల్‌ను అరెస్టు చేసినా ఎన్నికల సంఘం మౌనం వహిస్తోందన్నారు. ఈ నియంతృత్వంపై ఎవరైనా పాట రాస్తే కమిషన్ అప్రమత్తమవుతుందని ఆమె విమర్శించారు.

ఈ పాటలో బీజేపీని ప్రస్తావించలేదని, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించలేదనే విషయాలను గమనించాలని సూచించారు. ఇందులో వాస్తవ వీడియోలు, సంఘటనలు ఉన్నాయని తెలిపారు. దీనికి ముందు ఆదివారం ఉదయం కేజ్రీవాల్‌కు మద్దతుగా ‘వాక్ ఫర్ కేజ్రీవాల్’ పేరుతో పాదయాత్రతో ఆప్ ప్రచారం నిర్వహించింది. ఢిల్లీలోని సీఆర్ పార్క్ నుంచి ఈ పాదయాత్ర సాగింది. ‘జైల్ కా జవాబ్ ఓట్ సే’ అనే నినాదాలతో కేజ్రీవాల్ ఫొటో, పార్టీ జెండాలతో ఆప్ మద్దతుదారులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

You may also like

Leave a Comment