Telugu News » Acharya Satyendra Das: రాహుల్‌ను జైలుకు పంపాలి: సత్యేంద్ర దాస్

Acharya Satyendra Das: రాహుల్‌ను జైలుకు పంపాలి: సత్యేంద్ర దాస్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన శ‌క్తి వ్యాఖ్య‌ల‌పై శ్రీ రామ జ‌న్మ‌భూమి(Srirama janma bhoomi) ఆల‌య ప్ర‌ధాన పూజారి ఆచార్య స‌త్యేంద్ర దాస్(Acharya Satyendra Das) ఖండించారు.

by Mano
Acharya Satyendra Das: Rahul should be sent to jail: Satyendra Das

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన శ‌క్తి వ్యాఖ్య‌ల‌పై శ్రీ రామ జ‌న్మ‌భూమి(Srirama janma bhoomi) ఆల‌య ప్ర‌ధాన పూజారి ఆచార్య స‌త్యేంద్ర దాస్(Acharya Satyendra Das) ఖండించారు. కాంగ్రెస్ నేత‌లు(Congress Leaders) ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తుండ‌ట‌మే ఆ పార్టీ ప‌త‌నానికి కార‌ణ‌మ‌ని వ్యాఖ్యానించారు.

Acharya Satyendra Das: Rahul should be sent to jail: Satyendra Das

భార‌త్ జోడో న్యాయ్ యాత్ర(Bharat Jodo Nyay Yatra) ముగింపు సంద‌ర్భంగా ఆదివారం రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘హిందూమ‌తంలో శ‌క్తి అన్న ప‌దం ఉంది.. ఆ శక్తితో మేం పోరాడుతున్నాం. ఆ శ‌క్తి ఏంట‌న్న‌దే ప్ర‌శ్న.. ఓ రాజు ఆత్మ ఈవీఎంలో ఉన్న‌ది.. ఇది నిజమని ఈడీ, సీబీఐ, ఆదాయ ప‌న్నుశాఖ లాంటి సంస్థ‌ల‌పైనే ఆ రాజు ఆత్మ ఉంది..’’ అంటూ రాహుల్ విమ‌ర్శించారు.

కాగా రాహుల్ వ్యాఖ్యలపై ఆచార్య స‌త్యేంద్ర దాస్ తప్పుబట్టారు. కాంగ్రెస్ హిందూ వ్య‌తిరేక పార్టీ కావ‌డంతోనే ఆ పార్టీ నేతలు ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్నరని మండిపడ్డారు. భార‌త్ హిందువుల మెజారిటీ దేశ‌మ‌ని, మీరు ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తుంటే వారితో ఎవ‌రు క‌లిసి పనిచేస్తారని ప్ర‌శ్నించారు.

రాహుల్ వ్యాఖ్యలు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ప‌త‌నానికి కార‌ణ‌మ‌వుతాయని అన్నారు. హిందూ ధ‌ర్మం, స‌నాత‌న ధ‌ర్మంలో నారీశ‌క్తి గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని స‌త్యేంద్ర దాస్ అభిప్రాయపడ్డారు. హిందూ దేవ‌త‌ల‌కు వ్య‌తిరేకంగా మాట్లాడేవారిని జైలుకు పంపాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

You may also like

Leave a Comment