తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు(Telangana Assembly Elections) దగ్గర పడుతున్నాయి. నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రమంతా ఎన్నికల చర్చే కొనసాగుతోంది. సినిమా నటులు సైతం రాజకీయాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా హీరో నాని(Hero Nani) రాజకీయాల్లోకి వస్తున్నట్లు అనౌన్స్ చేశాడు. అంతేకాదు, తనకే ఓటు వేయాలంటూ కోరాడు.
అదేంటీ, నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసింది. నాని నామినేషన్ కూడా వేయకుండా ఎలా పోటీ చేస్తున్నాడు అనుకుంటున్నారా. నిజానికి హీరో నాని ఓటు వేయమని కోరింది.. తన సినిమాకు. అవునండీ.. సినిమా హీరోలు ఈ మధ్య తమ సినిమా ప్రమోషన్ల కోసం రాజకీయాలనూ వదలడంలేదు మరి. నాని, మృణాల్ ఠాకూర్ నటించిన హాయ్ నాన్న సినిమా డిసెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
కొత్త దర్శకుడు శౌర్యవ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో నాని సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన నాని, మృణాల్.. దేన్నీ వదలకుండా సినిమా గురించి హైప్ ఇచ్చేస్తున్నారు. సోషల్ మీడియా, యూట్యూబ్, ప్రెస్ మీట్స్, చివరికి ఎలక్షన్స్ కూడా వదలలేదు.
తాజాగా నాని రాజకీయాల్లోకి అడుగుపెట్టాడా..? అనేంతగా నాని.. హాయ్ నాన్న ప్రమోషన్స్ చేస్తున్నాడు. తాజాగా నాని తన ట్విట్టర్లో ఓ ఫొటోను షేర్ చేస్తూ తనకు ఓటు వేసి గెలిపించాలని అభిమానులను కోరాడు. ఆ ఫొటోలో నాని రాజకీయ నాయకుడిలా రెడీ అయ్యి.. ప్రచారానికి వెళ్తూ దండం పెడుతున్నట్లు కనిపించాడు.
‘డిసెంబర్ 7 న మీ ప్రేమ, మీ ఓటు మాకే వెయ్యాలని.. మీ హాయ్ నాన్న పార్టీ ప్రెసిడెంట్ విరాజ్.. కొన్ని సరదా ప్రచార కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. మరి ఈ సినిమా నానికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
Since it’s all elections mood around. Why not join the madness 🙂
December 7th మీ ప్రేమ మరియు vote మాకే అవ్వాలని 😉
Mee #HiNanna party president
Viraj 🤗
( few fun campaigning specials will follow ) pic.twitter.com/QdtR6YKmDa— Nani (@NameisNani) November 17, 2023