Telugu News » Drishti 10 : నేవీ కోసం ఆదానీ గ్రూప్ ‘దృష్టి 10’…. ఆవిష్కరించిన నేవీ చీఫ్..!

Drishti 10 : నేవీ కోసం ఆదానీ గ్రూప్ ‘దృష్టి 10’…. ఆవిష్కరించిన నేవీ చీఫ్..!

హైదరాబాద్‌లో అదానీ ఏరో స్పేస్ లో నిర్వహించిన కార్యక్రమానికి హరికుమార్ ముఖ్యఅతిథిగా హాజరై ఈ వాహానాన్ని ఆయన ఆవిష్కరించారు.

by Ramu
Adani Group unveils first indigenously manufactured Drishti 10 UAV with 36 hours of endurance

దేశీయంగా తయారు చేసిన మానవరహిత వైమానిక వాహనం (Unmanned Aerial Vehicle) దృష్టి-10 స్టార్ లైనర్‌ (Drishti 10 Starliner)ను భారత నావికాదళ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌.హరి కుమార్‌ (R. Hari Kumar) ప్రారంభించారు. అదానీ డిఫెన్, ఏరో స్పేస్ సంస్థ ఈ వాహనాన్ని తయారు చేసింది.

Adani Group unveils first indigenously manufactured Drishti 10 UAV with 36 hours of endurance

హైదరాబాద్‌లో అదానీ ఏరో స్పేస్ లో నిర్వహించిన కార్యక్రమానికి హరికుమార్ ముఖ్యఅతిథిగా హాజరై ఈ వాహానాన్ని ఆయన ఆవిష్కరించారు. రక్షణ, భద్రతలో ‘ఆత్మనిర్భర్త’ను ప్రారంభించేందుకు నేవీ అవసరాలకు అనుగుణంగా, భాగస్వాములు, సామర్థ్యాల, పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో అదానీ గ్రూప్ ప్రయత్నాలను ఈ సందర్బంగా నేవీ చీఫ్ అభినందించారు.

ఐఎస్ఆర్ సాంకేతికత, సముద్ర ఆధిపత్యంలో భారత స్వావలంబన కోసం ఇది ఒక పరివర్తనాత్మక దశ అని తెలిపారు. దృష్టి 10 చేరిక తమ నావికా సామర్థ్యాలను మెరుగుపరుస్తుందన్నారు. గత కొన్నేళ్లుగా అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ నిబద్ధతతో, క్రమబద్ధంగా పనిచేస్తోందన్నారు.

దృష్టి డ్రోన్లు.. ఇంటెలిజెన్స్, నిఘా, గూఢచర్య (ఐఎస్ఆర్) కార్యకలాపాలలో దేశ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు, సముద్ర జలాల్లో భారత ఆధిపత్యం కొనసాగేందుకు తాజా ఆవిష్కరణ చాలా తోడ్పడుతుందున్నారు. వాటితో నిఘా, గూఢచర్యంలో నేవి మరింత పట్టు సాధిస్తుందని పేర్కొన్నారు.

You may also like

Leave a Comment