Telugu News » Adimulapu Suresh : మాకేం అవసరం.. ముందుంది అసలు సినిమా!

Adimulapu Suresh : మాకేం అవసరం.. ముందుంది అసలు సినిమా!

చంద్రబాబు అరెస్టులో రాజకీయ కోణం ఏమీ లేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోంది.

by admin
Adimulapu Suresh Comments on Chandrababu Naidu Arrest

ఆదిమూలపు సురేష్, ఏపీ మంత్రి

స్కిల్ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్ అంశం చాలా చిన్నది. ఇప్పుడు చూసింది గోరంత మాత్రమే.. చూడాల్సింది కొండంత ఉంది. అమరావతి, టిడ్కో హౌస్ స్కాం లాంటివి చాలా ఉన్నాయి. చంద్రబాబు (Chandrababu) అయినా, లోకేష్ (Lokesh) అయినా అవినీతికి పాల్పడితే వదిలేదే లేదు. ప్రతీ స్కాం వెలికి తీస్తాం. మా ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉంటోంది. బంద్ లతో నానా యాగీ చేస్తున్నారు. చంద్రబాబును టీడీపీ (TDP) క్యాడర్ కూడా నమ్మడం లేదు.

Adimulapu Suresh Comments on Chandrababu Naidu Arrest

చంద్రబాబు అరెస్టులో రాజకీయ కోణం ఏమీ లేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోంది. ప్రజాసేవలో ఉన్నవాళ్లు పాలిటిక్స్ అంటే పీపుల్స్ మేనేజ్మెంట్ కాదు. సర్వింగ్ టూ పీపుల్ అనే కాన్సెప్ట్ ఒంట బట్టించుకోవాలి. ఆ పాయింట్ మిస్ అయ్యారు చంద్రబాబు. ఆయన బెయిల్ కోసం హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్ళటం కాదు. తప్పు జరిగిందా? లేదా? అనేదే ముఖ్యం.

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి మేనిఫెస్టోలో ఉన్న ప్రధాన అంశాన్ని ముడుపులు తీసుకోవటానికి వాడుకున్నారు చంద్రబాబు. చంద్రబాబును అరెస్ట్‌ చేయగానే ఆయన పుత్రుడు లోకేశ్, దత్తపుత్రుడు పవన్‌ కళ్యాణ్‌ రోడ్ల మీదకు వచ్చి రచ్చ చేస్తున్నారు. టీడీపీ నేతలు చెబుతున్నట్టు ఇందులో రాజకీయ ప్రమేయం ఎక్కడుంది. చంద్రబాబు తప్పిదాలు చాలా ఉన్నాయి. ఎన్నో కేసుల్లో ఆయన ముద్దాయి.

You may also like

Leave a Comment