Telugu News » Haragopal : తెలంగాణ వచ్చాక రాష్ట్రం దివాళా తీసింది.. హరగోపాల్..!?

Haragopal : తెలంగాణ వచ్చాక రాష్ట్రం దివాళా తీసింది.. హరగోపాల్..!?

రాజకీయాలన్ని డబ్బు చుట్టే తిరుగుతున్నాయని హరగోపాల్ పేర్కొన్నారు. ప్రజాసేవ చాటున రాష్ట్ర సంపద దోపిడీకి గురవుతుందని.. బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం తెలంగాణ అస్తిత్వాన్ని నాశనం చేసిందని హరగోపాల్ ఆరోపణలు చేశారు.

by Venu

తెలంగాణ (Telangana) రాజకీయాలపై పీపుల్స్ జేఏసీ (JAC) తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్ (Professor-Haragopal) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక రాష్ట్రం అంటూ పరిగెత్తారు.. కానీ నేడు ప్రత్యేక రాష్ట్రం కంటే ఉమ్మడి రాష్ట్రమే బాగుంది అనేలా పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయని హరగోపాల్ తెలిపారు. రాజకీయాలన్ని డబ్బు చుట్టే తిరుగుతున్నాయని హరగోపాల్ పేర్కొన్నారు.

ప్రజాసేవ చాటున రాష్ట్ర సంపద దోపిడీకి గురవుతుందని.. బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం తెలంగాణ అస్తిత్వాన్ని నాశనం చేసిందని హరగోపాల్ ఆరోపణలు చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్య సంస్కృతి పోయిందని, దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత రాష్ట్ర ప్రజలకు ఉందని హరగోపాల్ పిలుపునిచ్చారు. ఉద్యమం కోసం కళాకారులను వాడుకొని.. ప్రస్తుతం పాటలు కనుమరుగు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ పేరు మీద గెలిచి.. దేశాలు పట్టుకుని తిరుగుతూ గౌరవం లేకుండా చేశారని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం అంటూ ఉమ్మడి రాష్ట్రాన్ని విడగొట్టారు.. తర్వాత జిల్లాల విభజన పేరుతో రాష్ట్రాన్ని ముక్కలు చేసి విశిష్టత లేకుండా చేశారని హరగోపాల్ తెలిపారు. తెలంగాణ పేరుతో ఉద్యమాలు చేసి.. భారత్ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసుకోవడం తిన్నింటి వాసాలు లెక్కపెట్టినట్టే అని హరగోపాల్ విమర్శించారు.

తెలంగాణ చరిత్రను కనుమరుగు చేస్తున్న నేతలు.. నిజమైన తెలంగాణ ఎక్కడికి పోయిందో చెప్పాలని హరగోపాల్ డిమాండ్ చేశారు. ఎన్నికలు వస్తేనే బీఆర్ఎస్ నేతలకు, మంత్రులకు తెలంగాణ గుర్తుకు వస్తుందా..? అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రం దివాలా తీస్తున్న పట్టించుకోకుండా.. అక్రమంగా భూములు కబ్జా చేస్తున్నారని.. వ్యక్తిగత సంపద పెంచుకుంటున్నారని హరగోపాల్ మండిపడ్డారు..

తెలంగాణ వచ్చాక ప్రభుత్వ యూనివర్శిటీలను నిర్వీర్యం చేశారని.. ఉస్మానియా, కాకతీయ యూనివర్శిటీలను పట్టించుకోవడం మానేశారని అన్నారు. రాష్ట్రంలోని గవర్నమెంట్ పాఠశాలలను పాడు చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనపై పౌర సమాజం చైతన్యంగా ఆలోచించాలని పిలుపునిచ్చారు.

You may also like

Leave a Comment