ప్రజాసేవ పేరుతో రాజకీయాల్లోకి వచ్చి.. ప్రజలకే కుచ్చుటోపీ పెడుతోన్న నేతలు రాజకీయాల్లో పెరిగిపోతున్నారనే ఆరోపణలున్నాయి.. అందులో ఒకప్పుడు స్కామ్ లు ఎక్కువగా ఉండేవి.. కానీ బీఆర్ఎస్ (BRS) అధికారంలోకి వచ్చాక భూ కబ్జాలు (Land grabs) ఎక్కువైయ్యాయని రాష్ట్రం మొత్తం కోడై కూసిన సందర్భాలున్నాయి.. పార్టీలు మారిన కబ్జాసూరుల బారిన పడిన బాధితుల సమస్యలు మాత్రం తీరడం లేదని అనుకొంటున్నారు.
ఈ నేపథ్యంలో మరోసారి భూ బాధితులు రోడ్డెక్కారు.. మంచిర్యాల (Mancherial) ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు (MLA Prema Sagar Rao) మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy) నుంచి తమ భూ ములను కాపాడాలంటూ ప్రజాభవన్ ముందు ఆందోళనకు దిగారు. కాప్రా సర్వేనెంబర్ 647/1, 648& 654లో భూమిని మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే కబ్జా చేశారంటూ కాప్రా కృష్ణా నగర్ ప్లాట్ ఓనర్స్ నిరసన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి తమకు న్యాయం చేయాలంటూ ఫ్లకార్డులతో ఆందోళకి దిగారు..
మరోవైపు మాజీ మంత్రి మల్లారెడ్డి.. మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి సర్వేనెంబర్ 648/650లో తమ భూములను కబ్జా చేశారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. శ్రీ మల్లికార్జుననగర్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీలో తమ భూములను మల్లారెడ్డి కబ్జా చేసారంటూ.. ప్రజావాణిలో తమ సమస్య విన్నవించేందుకు 600 మందికిపైగా బాధితులు వచ్చారు. మల్లారెడ్డి నుంచి తమ భూములను కాపాడాలంటూ నినాదాలు చేశారు..
గత ప్రభుత్వ హయాంలో భారీగా భూములు కబ్జాకు గురైనట్టు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.. కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఇలాంటి సమస్యలు పురావృతం కాకుండా చూసుకొంటుందా అనే సందేహాలు కొందరిలో కలుగుతున్నాయి. ఇదే విషయాన్ని ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమం ద్వారా విన్నవించుకోవడానికి తరలి వస్తున్న బాధితులను చూస్తే భూ మాఫియా రాష్ట్రంలో ఏ స్థాయిలో రెచ్చిపోతుందో అర్థం అవుతుందని అనుకొంటున్నారు.