వేల సంవత్సరాల చరిత్ర ఉన్న భారత దేశంలో ఎన్నో వింతలు, మరెన్నో విశేషాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా హిందూ సంప్రదాయాలను అనాదిగా పాటిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఆలయాల్లో భక్తుల వివిధ రకాల నమ్మకాలతో వింత ఆచారాలను పాటిస్తుంటారు. ఇదే కోవలో కర్ణాటక(Karnataka)లోని మంగళూరులో అనాది నుంచి ఓ వింత సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
కటీల్ శ్రీ దుర్గాపరమేశ్వరి ఆలయంలో ‘తుతేధార’ లేదా ‘అగ్ని కేళి’ పండుగ చేస్తారు. మంగళూరు నుంచి 30 కి.మీ దూరంలో ఉంది. ఆలయంలో భక్తులు 8 రోజుల పాటు అగ్నితో ఆడుకునే అగ్ని కేళి పండుగను నిర్వహిస్తారు. అగ్నికేళి అంటే ప్రజలు నిప్పుతో ఆడుకుంటారు. వారి సంప్రదాయం ప్రకారం కాల్చిన తాటి ఆకులను భక్తులు ఒకరిపై ఒకరు విసురుకుంటారు.
ఈ ఆచారం కాలక్రమేనా కొబ్బరి బెరడుతో చేసిన కాగడాలతో కొనసాగుతోంది. దీన్ని 15 నిమిషాలు ఆడతారు. ఇలా చేయడం వల్ల తమ బాధలు తగ్గుతాయని ప్రజలు నమ్ముతారు. ఈ సమయంలో కళత్తూరు, అత్తూరు గ్రామాల ప్రజలు ఈ సంప్రదాయంలో పాల్గొంటుండగా, మరోవైపు ఆలయ ప్రాంగణంలో వీరిని చూసేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తారు.
ఇది ప్రమాదకరమైనప్పటికీ అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ప్రతి సంవత్సరం కటీల్ దుర్గా పరమేశ్వరి ఆలయ ఉత్సవాల్లో ఈ ఆట నిర్వహిస్తున్నారు. భక్తులు ఈ పండుగలో ఎనిమిది రోజులు ఉపవాసం ఉంటారు. మాంసం, మద్యానికి దూరంగా ఉంటారు. కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో నందిని నది మధ్యలో ఉన్న ఒక ద్వీపంలో ఉన్న దుర్గాపరమేశ్వరి ఆలయం కటీల్లోని పురాతన దేవాలయాల్లో ఒకటిగా పేరుగాంచింది.
#WATCH कर्नाटक: मंगलुरु के कतील श्री दुर्गापरमेश्वरी मंदिर में वार्षिक उत्सव 'तूतेधारा' या 'अग्नि केली' के हिस्से के रूप में भक्तों ने एक-दूसरे पर जलते हुए ताड़ के पत्ते फेंकें। pic.twitter.com/frZC5E4V1Q
— ANI_HindiNews (@AHindinews) April 21, 2024