Telugu News » Actor Nani: గుండె బరువెక్కింది.. నాని ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

Actor Nani: గుండె బరువెక్కింది.. నాని ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

నేచురల్ స్టార్ నాని(Nani) కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘జెర్సీ’ (Jersey). స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో నాని క్రికెటర్‌గా నటించారు. ఈ సినిమా విడుదలై ఏప్రిల్ 19తో ఐదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో శనివారం 'జెర్సీ' స్పెషల్ షో వేశారు.

by Mano
Actor Nani: Heart heavy.. Nani's emotional post viral..!

నేచురల్ స్టార్ నాని(Nani) కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘జెర్సీ’ (Jersey). స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో నాని క్రికెటర్‌గా నటించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా విడుదలై ఏప్రిల్ 19తో ఐదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో శనివారం ‘జెర్సీ’ స్పెషల్ షో వేశారు.

Actor Nani: Heart heavy.. Nani's emotional post viral..!

దీనికి నాని తన భార్య అంజనాతో కలిసి అభిమానులతో కలిసి ఈ సినిమాను చూశారు. కాగా, తాజాగా నాని ఈ సినిమాకు సంబంధించి ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు “ఈరోజు నాకెంతో భావోద్వేగంగా ఉంది. అభిమానులు ఆదరణ చూస్తుంటే.. మళ్లీ తన ప్రయాణాన్ని ఆస్వాదించడానికి అర్జున్ (సినిమాలో తన పాత్ర పేరు) తిరిగి భూమ్మీదకు వచ్చినట్టుంది. గుండె బరువెక్కింది. అభిమానుల ప్రేమాభిమానాలతో మనసు నిండిపోయింది” అని నాని ఎమోషనల్ అయ్యాడు.

అంజనా సైతం ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. “తొలిసారి థియేటర్‌లో ఆ సినిమా చూసిన రోజులు నాకింకా గుర్తున్నాయి. ఎన్నిసార్లు చూసినా ఆ సీన్స్ నన్ను భావోద్వేగానికి గురిచేస్తాయి. మా అబ్బాయి అర్జున్ ఇప్పుడిప్పుడే ‘జెర్సీ’ థీమ్ సాంగ్ పియానోపై ప్లే చేయడం నేర్చుకుంటున్నాడు” అని రాసుకొచ్చింది.

నాని ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రియాంకా అరుళ్ మోహన్ కథానాయికగా ఎంపిక చేశారు. ఈ సినిమాలో ఎస్‌జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ‘దసరా’ ఫేమ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, ‘బలగం’ ఫేమ్ వేణుతోనూ నాని సినిమాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాలకు సంబంధించి ఇంకా ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు.

 

You may also like

Leave a Comment