కేంద్ర ప్రభుత్వం(Central Govt) నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. అగ్నివీర్ పథకం (Agniveer Scheme) కింద 2024-2025 సంవత్సరానికి గానూ ఫైర్‌మెన్ నియామకాలకు శుక్రవారం నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. ఈమేరకు సికింద్రాబాద్‌లోని ఆర్మీ రిక్రూట్‌మెంట్ కార్యాలయం అధికారులు వివరాలు వెల్లడించారు.
అగ్నివీర్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైందని పరీక్షలు ఏప్రిల్ 22 నుంచి నిర్వహించనున్నట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. వయో పరిమితి 17 ఏళ్ల నుంచి 21 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ మార్చి 22 వరకు అని తెలిపారు. కాగా, మరిన్ని వివరాలను అధికారిక వెబ్‌సైట్ https://joinindianarmy.nic.inలో సంప్రదించాలని అధికారులు సూచించారు.
పోస్టుల విషయానికి వస్తే.. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్, అగ్నివేర్ ట్రేడ్స్ మ్యాన్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఇక అగ్నివీర్ జనరల్ డ్యూటీకి కనీసం 10వ తరగతి 45 మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. టెక్నికల్ పోస్టులకు ఇంటర్ పూర్తి చేసి, ఐటీఐ కూడా చేసి ఉండాలి.
వివాహం కాని పురుషులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని పేర్కొన్నారు. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తదుపరి దశలో ఫిజికల్, వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. మరోవైపు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులను పరిశీలిస్తే 60 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత, ట్రేడ్స్‌మన్‌కు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.