Telugu News » Gas Cylinder Scheme : రాష్ట్రంలో రూ.500కే గ్యాస్‌.. మొదటి విడతలో వీరికే ఛాన్స్..!

Gas Cylinder Scheme : రాష్ట్రంలో రూ.500కే గ్యాస్‌.. మొదటి విడతలో వీరికే ఛాన్స్..!

డీలర్లకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా కొంత మొత్తాన్ని అడ్వాన్సుగా ఇస్తామని పౌరసరఫరాల శాఖ ప్రతిపాదించింది. సిలిండర్ల పంపిణీ ఆధారంగా మిగతా మొత్తం చెల్లిస్తామని తెలిపింది.

by Venu
Commercial LPG cylinders prices increased from today check new rates

అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా తెలంగాణ (Telangana) ప్రజలకు రూ.500కే సిలిండర్‌ అందించేందుకు కాంగ్రెస్ (Congress) ప్రభుత్వ సిద్దం అవుతోంది. ఈ క్రమంలో పౌరసరఫరాల శాఖ రాష్ట్రంలోని గ్యాస్‌ డీలర్లు ఈ పథకం అమలుకు సిద్ధం కావాలని స్పష్టం చేసింది. గురువారం జరిగిన క్యాబినెట్‌ సబ్‌కమిటీ సమావేశంలో.. ఈ పథకంపై గ్యాస్‌ డీలర్లతో చర్చించాలని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు.

దీంతో వెంటనే పౌరసరఫరాల శాఖ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సివిల్‌ సప్లయ్స్‌ భవన్‌లో తెలంగాణ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్‌ ప్రతినిధులతో నిర్వహించిన ఈ సమావేశంలో కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు. మరోవైపు రాష్ట్రంలో 1.20 కోట్ల మందికి గ్యాస్‌ వినియోగదారులు ఉన్నారు. వీరిలో రేషన్‌కార్డు ఉన్నవారి సంఖ్య 89.99 లక్షలు. ప్రాథమిక అంచనా మేరకు ప్రస్తుతం 39.50 లక్షల మందిని సబ్సిడీ గ్యాస్‌ పథకానికి అర్హులుగా గుర్తించినట్లు సమాచారం.

ఇక ఈ పథకం అమల్లోకి వచ్చిన రోజు నుంచి అర్హులైన వినియోగదారులకు రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ (Gas Cylinder) ఇవ్వాలని పౌరసరఫరాలశాఖ డీలర్లకు స్పష్టం చేసింది. కాగా ప్రస్తుతం చేస్తున్న ఇంటింటి సర్వే పూర్తయ్యాక అర్హుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా గ్యాస్‌ సిలిండర్లపై ఇచ్చే సబ్సిడీకి జాతీయ బ్యాంకు అగ్రిగేటర్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు డీలర్లకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా కొంత మొత్తాన్ని అడ్వాన్సుగా ఇస్తామని పౌరసరఫరాల శాఖ ప్రతిపాదించింది. సిలిండర్ల పంపిణీ ఆధారంగా మిగతా మొత్తం చెల్లిస్తామని తెలిపింది. ఇక ప్రస్తుతం గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.955గా ఉంది. ఒక్కో సాధారణ కనెక్షన్లపై బుకింగ్‌కు కేంద్రం రూ.40 రాయితీ ఇస్తోంది. అదే ఉజ్వల్‌ కనెక్షన్లకైతే రాయితీగా రూ.340 అందిస్తోంది. తెలంగాణలో ఉజ్వల్‌వి 11.58 లక్షలు ఉన్నాయి. గివ్‌ ఇట్‌ అప్‌లో భాగంగా రాష్ట్రంలోని 4.2 లక్షల మంది ఈ రాయితీని వదులుకున్నారని సమాచారం..

You may also like

Leave a Comment