ఢిల్లీ (Delhi)లో మళ్లీ కాలుష్యం పెరిగింది. వాతావరణ మార్పులతో గాలి నాణ్యత మరింత క్షీణిస్తుందని అధికారులు వెల్లడిస్తున్నారు.. శనివారం మరోసారి AQI 400కి చేరుకొంది. మరో మూడు రోజుల పాటు ప్రమాదకర పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorology Department) అధికారులు హెచ్చరిస్తున్నారు. గత రెండు రోజులుగా నగరంలో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడమే గాలి నాణ్యత లోపానికి కారణమని వాతావరణ శాఖ అధికారి ఒకరు తెలిపారు.
మరోవైపు డిసెంబరు 31 నుంచి జనవరి 2 వరకు ఢిల్లీలో గాలి నాణ్యత వెరీ పూర్ కేటగిరీలోనే ఉండే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ ‘ఎర్లీ వార్నింగ్ సిస్టమ్’ పేర్కొంది. డిసెంబరు 31న కాల్చిన బాణాసంచా నుంచి వెలువడే పొగ కారణంగా గాలి నాణ్యత క్షీణించవచ్చని తెలిపిన వాతావరణ శాఖ.. రానున్న రెండు మూడు రోజుల పాటు ఢిల్లీలో, చలి, పొగమంచు సమానంగా ఉండే అవకాశం ఉందన్నారు. కనిష్ట, గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో ఢిల్లీలో చలికాలం తీవ్రంగా ఉండబోతోందని తెలిపారు..
మరోవైపు కొత్త సంవత్సరం (New Year) సందర్భంగా ప్రజలు క్రాకర్లు పేల్చితే గాలి నాణ్యత మరింత క్షీణించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.. రాజధానిలో బాణసంచా కాల్చడం పూర్తిగా నిషేధించినప్పటికీ.. కానీ దాని ప్రభావం పెద్దగా కనిపించదన్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ప్రజలు బాణసంచా కాల్చే అవకాశాలు ఉన్నాయని.. దీనివల్ల కాలుష్యం మరింత పెరిగవచ్చని అంటున్నారు.. ఇప్పటికే ఢిల్లీ ప్రజలు విషపూరితమైన గాలితో అనారోగ్యాల బారిన పడుతోన్న విషయం తెలిసిందే..