Telugu News » ISRO: మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. కౌంట్‌డౌన్ షురూ..!!

ISRO: మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. కౌంట్‌డౌన్ షురూ..!!

ఈఏడాది చంద్రయాన్‌-3, ఆదిత్య-ఎల్‌1 మిషన్లను ఇస్రో విజయవంతంగా ప్రయోగించి భారత విజయపతాకాన్ని ఎగురవేసింది. ఇప్పుడు అదే స్ఫూర్తితో మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఈసారి పీఎస్ఎల్‌వీ-సీ58(PSLV-C58) ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు చేసింది.

by Mano
ISRO: ISRO ready for another launch.. countdown is on..!!

శాస్త్రసాంకేతిక రంగంలో అద్భుత విజయాలతో దూసుకెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) కొత్త సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించడానికి సిద్ధమైంది. ఈఏడాది చంద్రయాన్‌-3, ఆదిత్య-ఎల్‌1 మిషన్లను ఇస్రో విజయవంతంగా ప్రయోగించి భారత విజయపతాకాన్ని ఎగురవేసింది. ఇప్పుడు అదే స్ఫూర్తితో మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఈసారి పీఎస్ఎల్‌వీ-సీ58(PSLV-C58) ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు చేసింది.

ISRO: ISRO ready for another launch.. countdown is on..!!
ఈ ప్రయోగానికి సంబంధించి ఇవాళ(ఆదివారం) ఉదయం 8.10 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభించారు. 25 గంటలపాటు కొనసాగిన తర్వాత సోమవారం ఉదయం 9.10 గంటలకు పీఎస్ఎల్‌వీ-సీ58 వాహకనౌక షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. పీఎస్ఎల్వీ వాహకనౌక మనదేశానికి చెందిన ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహం (ఎక్స్ పోశాట్)‌ను అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది.

ఎక్స్‌-రే మూలాలను అన్వేషించడం దీని ఈ శాటిలైట్‌ ప్రధాన లక్ష్యం. ఈ ఉపగ్రహం జీవితకాలం ఐదేళ్లు. సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ (శ్రీహరి కోట)లో శనివారం రాకెట్ సన్నద్ధత (ఎంఆర్ఆర్), లాంచ్ ఆథరైజేషన్ సమావేశాలు జరిగాయి. ఇందులో రాకెట్ అనుసంధానం, ఉపగ్రహ అమరిక, పరీక్షలు తదితరాలపై సుదీర్ఘంగా చర్చించారు. పీఎస్ఎల్‌వీ రాకెట్ సిరీస్‌లో ఈ ప్రయోగం 60వది కావటం విశేషం.

పీఎస్ఎల్వీ సీ58 రాకెట్ 44.4 మీటర్లు పొడవు కలిగి ప్రయోగ సమయంలో 260 టన్నుల బరువు ఉంటుంది. ఈ ప్రయోగాన్ని నాలుగు దశల్లో 21.55 నిమిషాల్లో పూర్తిచేయనున్నారు. ఎక్స్ పోశాట్ భారతదేశం అంతరిక్ష ఆధారిత ఎక్స్-రే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి నాందిపలకనుంది.

You may also like

Leave a Comment