గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఇవాళ తెలంగాణ (Telangana) అసెంబ్లీలో చర్చ జరుగుతోన్న సందర్భంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు (Sensational Comments) చేశారు. ముస్లింల అభివృద్ధికి బీఆర్ఎస్ (BRS)..కాంగ్రెస్ పార్టీలు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు. రాజకీయాలు ఎన్నికల వరకే.. గెలిచిన పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ప్రజల కోసం పనిచేయాలని అక్బరుద్దీన్ వెల్లడించారు..
పాతబస్తీ అభివృద్ధి విషయంలో ఇప్పటి వరకి ఎక్కడవేసిన గొంగళి అక్కడనే అన్న పరిస్థితిలా ఉందని ఆరోపించిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ (Akbaruddin)..ఈ విషయం పై ప్రభుత్వ పెద్దలు చొరవ తీసుకోవాలని తెలిపారు.. పాతబస్తీ అభివృద్ధి విషయంలో ప్రభుత్వానికి తప్పక సహకరిస్తామని వెల్లడించారు. ముస్లింల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సాఆర్ ఎంతో కృషి చేశారని గుర్తు చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉర్దూ ప్రస్తావన లేదన్నారు..
మరోవైపు కాంగ్రెస్, ముస్లింలకి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు అక్బరుద్దీన్.. డీఎస్సీ మాత్రమే కాదు.. ఇతర పరీక్షలు సైతం ఉర్దూలో నిర్వహించాలని పేర్కొన్నారు. ఇమామ్ లకు రూ.12వేలు కాదని.. రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మదర్సా బోర్డు ఏర్పాటు చేయాలని తెలిపిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్.. ముస్లిం అభ్యర్థులను కాంగ్రెస్ (Congress) బీఆర్ఎస్ పార్టీలు గెలిపించలేక పోవడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు..