ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun).. నేషనల్ క్రష్ రష్మికా మందన్న (Rashmika Mandanna) హీరో, హీరోయిన్ గా డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో ‘పుష్ప ది రైజ్’ కు సీక్వెల్‌గా వస్తున్న మూవీ ‘పుష్ప2’ (Pushpa-2).. కాగా ఈ చిత్రం మొదటి పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకొన్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలో వస్తున్న పార్ట్ 2 పై సైతం మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి..

ఇలా డిఫరెంట్ లుక్ లో ఐకాన్ స్టార్ కనిపించడంతో తిరుపతిలో గంగమ్మ తల్లి జాతరకు మాతంగి వేషం వేసిన పుష్ప రాజ్ లుక్ అదిరింది అంటూ.. అభిమానులు ఫిదా అవుతున్నారు. అయితే.. ఈ ఒక్క నిమిషం టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తూ.. ట్రెండింగ్‌లో నిలిచింది.. అయితే.. ఈ ఆరు నిమిషాల జాతర సన్నివేశాన్ని చిత్రీకరించడానికి మేకర్స్ సుమారుగా రూ. 60 కోట్లు ఖర్చు చేశారని టాక్ వినిపిస్తుంది..
అలాగే ఈ సీన్‌ని పూర్తి చేయడానికి మేకర్స్ దాదాపు 30 రోజులు పట్టిందని అనుకొంటున్నారు.. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంటే.. మ్యాటర్ తెలిసిన జనం.. షాక్ అవుతున్నారు..