ప్రపంచ వ్యాప్తంగా లేఆఫ్స్ (Layoffs) పరంపర కొనసాగుతోంది. తాజాగా అమెజాన్(Amazon) ఆ జాబితాలో చేరింది. అమెజాన్ లైవ్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫారమ్ Twitch 500 మంది ఉద్యోగులను తొలగించేందుకు రెడీ అయింది. కంపెనీ ఉద్యోగుల్లో 35 శాతం మందిని తొలంగించనున్నట్లు సమాచారం.
ఏడాది ప్రారంభంలోనే వందలాది మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది అమెజాన్ సంస్థ. ఈ మేరకు బ్లూమ్బర్గ్ నివేదిక వెల్లడించింది. బ్లూమ్బర్గ్ నివేదిక ప్రకారం.. అమెజాన్ లైవ్ స్ట్రీమింగ్ సర్వీసెస్ ప్రైమ్ వీడియో స్టూడియో విభాగంలోని మొత్తం ఉద్యోగుల్లో 35 శాతం మందిని తొలగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
దీని ప్రకారం చూసుకుంటే సుమారు 500 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోనున్నారు. తొలగింపు సమాచారాన్ని త్వరలో సదరు ఉద్యోగులకు అందించనున్నారు. అమెజాన్ సంస్థ తన ప్రైమ్ వీడియో, ఎంజీఎం స్టూడియో విభాగం నుంచి వందల మంది ఉద్యోగులపై వేటు వేయనున్నట్లు తెలిపింది.
తాజా తొలగింపులు అంతర్జాతీయంగా ఉంటాయని వెల్లడించినట్లుగా బ్లూమ్బర్గ్ తెలిపింది. తొలగింపు సమాచారాన్ని స్ట్రీమింగ్ వీడియో, స్టూడియో డివిజన్, ఎంజీఎం యూనిట్ అధినేత మైక్ హోప్కిన్స్ ఉద్యోగులకు ఈ-మెయిల్స్ ద్వారా అందించనున్నట్లు వెల్లడించింది.