Telugu News » Ambati Rambabu: చంద్రబాబుని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు: అంబటి

Ambati Rambabu: చంద్రబాబుని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు: అంబటి

అరెస్ట్ పేరుతో చంద్రబాబు సానుభూతి రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. అలాంటి సానుభూతి రాజకీయాలు ఇప్పుడు చెల్లవని చెప్పారు. కారణం లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని అన్నారు.

by Prasanna
ambati rambabu

తనని రేపో, మాపో అరెస్ట్ (Arrest) చేస్తారేమో అన్న చంద్రబాబు కామెంట్లను ఏపీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) తప్పుపట్టారు. చంద్రబాబు సానుభూతి రాజకీయాలు (Politics) చేసే  ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

ambati rambabu

అరెస్ట్ పేరుతో చంద్రబాబు సానుభూతి రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. అలాంటి సానుభూతి రాజకీయాలు ఇప్పుడు చెల్లవని చెప్పారు. కారణం లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని అన్నారు. చట్టం తన పని తాను చేసుకుని పోతుందని చెప్పారు. చంద్రబాబు తప్పు చేస్తే శిక్ష పడటం తప్పదని అన్నారు. చంద్రబాబు తప్పు చేయకపోతే వదిలిపెడతారని చెప్పారు.

మరో వైపు చంద్రబాబు దొంగ అని తేలినా కూడా ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ మాత్రం ఒప్పుకోడని, ఆయనని హీరో అనే చెప్తాడని అంబటి రాంబాబు అన్నారు. ఎందుకంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల మధ్య ఉన్న బంధం అటువంటిదన్నారు.

అందుకు నిదర్శనమే చంద్రబాబు రూ. 118 కోట్లు ముడుపులు తీసుకున్నరని సీబీఐ నోటీసులు ఇచ్చినా కూడా  పవన్ కల్యాణ్ నోరు విప్పలేదని అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌.. పెద్ద రాక్షసుడు, చిన్న రాక్షసుడు, దత్త రాక్షసులని విమర్శలు గుప్పించారు.

You may also like

Leave a Comment