Telugu News » Haryana CM:నన్నే అడుగుతావా..నిన్ను చంద్రుని మీదకు పంపిస్తా!

Haryana CM:నన్నే అడుగుతావా..నిన్ను చంద్రుని మీదకు పంపిస్తా!

‘ఉపాధి కల్పించడానికి కర్మాగారాన్ని కోరడమే మహిళ చేసిన ఏకైక నేరం. అలాంటి ముఖ్యమంత్రి సిగ్గుతో తలదించుకోవాలి’ అని రాశారు

by Sai
cm manohar lal khattar rude comments on poor women

హర్యానాలో ముఖ్యమంత్రి మనోహర్ లాల్(Manohar Lal) సమావేశానికి సంబంధించిన ఓ వీడియో వైరల్ (Viral) అవుతోంది. ఇందులో ఓ మహిళ తనతో ఉపాధి పనుల గురించి మాట్లాడితే.. ఆమెకు సీఎం వెటకారంగా సమాధానమిచ్చారు. సీఎం. హర్యానా ప్రభుత్వం నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు ఓ మహిళ తన గోడు వినిపించగా.. ముఖ్యమంత్రి వెటకారంగా నిన్ను చంద్రయాన్-4 ఎక్కించి పంపిస్తానని వెటకారం చేశారు.

cm manohar lal khattar rude comments on poor women

మహిళ పట్ల ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి.హర్యానాలోని హిస్సార్ పట్టణంలో జన సంవాద్ అనే కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మొదట మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను సందర్శించిన ముఖ్యమంత్రి తర్వాత మహిళలతో కాసేపు మాట్లాడారు. వారు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు.

ఇదే క్రమంలో ఓ మహిళ తమ గ్రామానికి సమీపంలో ఒక ఫ్యాక్టరీని నిర్మిస్తే మాలాంటి కొంత మహిళలకు ఉపాధి దొరుకుతుందని అభ్యర్ధించగా అందుకు సీఎం బదులిస్తూ.. మళ్ళీ ఇక్కడి నుంచి చంద్రయాన్ వెళ్తే అందులో నిన్ను పంపిస్తానని ఎద్దేవా చేశారు.. దీంతో అక్కడి వారంతా ఆ మహిళను వెంటనే కూర్చోమని బలవంతం చేశారు. అక్కడ మాట్లాడుతున్న సందర్భంలోనే ‘చంద్రయాన్-4 చంద్రుడి మీదకు వెళ్లగానే, మిమ్మల్ని అందులో పంపిస్తాం’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల్ని వీడియో తీసి నెట్టింట్లో వేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నెటిజెన్లు దీనిపై పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు.ఈ వీడియో వైరల్ కావడంతో ఆమ్ ఆద్మీ పార్టీ అధికార బీజేపీని టార్గెట్ చేసింది. ఈ వీడియోను షేర్ చేస్తూ, ఆప్ మాట్లాడుతూ, ‘ఉపాధి కల్పించడానికి కర్మాగారాన్ని కోరడమే మహిళ చేసిన ఏకైక నేరం. అలాంటి ముఖ్యమంత్రి సిగ్గుతో తలదించుకోవాలి’ అని రాశారు. అధికారంలోకి వచ్చే వరకు ఒకలా ఉంటారు.. అధికారం దక్కించుకున్నాక ఒకలా ఉంటారని ఉదహరించారు.

ఇక ఆమ్ ఆద్మీ పార్టీ అయితే ఇదే కోరిక ప్రధాని మోడీ సన్నిహితులెవరైనా కోరి ఉంటే ఆఘమేఘాల మీద ఫ్యాక్టరీని నిర్మించేవారని విమర్శించింది. అయితే వైరల్ అవుతున్న వీడియోపై ముఖ్యమంత్రి ఇంకా స్పందించలేదు. అదే సమయంలో కాంగ్రెస్ కూడా ఈ విషయంపై స్పందించింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే అంశంపై స్పందిస్తూ బీజేపీ ఆరెస్సెస్ మహిళలకు అంతకంటే ఏమి గౌరవమిస్తుందని విమర్శించింది.

 

You may also like

Leave a Comment