మూడు క్రిమినల్ చట్టాల (Criminal Laws) సవరణ బిల్లులకు లోక్‌సభ (Lok Sabha) ఆమోదం తెలిపింది. భారత న్యాయ సంహిత, భారత నాగరిక సురక్ష సంహిత, భారత సాక్ష్య అధినీయం బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలుపుతోన్నట్టు ప్రకటించింది. ఈ క్రమంలో బ్రిటిష్ కాలంనాటి ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో కొత్త చట్టాలు అమలులోకి రానున్నాయి. కాగా ఈ మూడు బిల్లులను కేంద్ర హోం మంత్రి అమిత్ షా రేపు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు.
అంతకుముందు లోక్‌సభలో అమిత్ షా (Amit Shah) మూడు బిల్లులకు సంబంధించి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ఈ బిల్లులు న్యాయం చేయడానికి తప్ప, శిక్షించడానికి కాదని తెలిపారు. వేగంగా న్యాయం చేయడానికి ఈ బిల్లులు తీసుకొచ్చినట్టు వెల్లడించారు. డిజిటల్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ సైతం సాక్ష్యంగా పరిగణనలోకి తీసుకొచ్చామని అన్నారు. వందేళ్ల వరకు ఈ చట్టాలు దేశంలో న్యాయ ప్రక్రియలో ఉపయోగపడతాయని అమిత్ షా వివరించారు..
ఇక క్రిమినల్ చట్టాల సవరణకి సంబంధించిన అంశాలని పరిశీలిస్తే.. ఈ బిల్లుల ప్రకారం యాక్సిడెంట్ చేసి పారిపోతే పదేళ్ల జైలు శిక్ష.. యాక్సిడెంట్లో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి చేరిస్తే శిక్ష సగానికి తగ్గింపు.. మూక దాడికి ఉరిశిక్ష, మైనర్‌పై గ్యాంగ్ రేప్ చేస్తే, జీవితకాల శిక్ష.. మైనర్ చనిపోతే నిందితులకు ఉరిశిక్ష.. దేశద్రోహానికి జీవితకాల శిక్ష నుంచి 7 ఏళ్లకు మార్పు.. నేరం చేసి వేరే దేశానికి పారిపోయిన వారు 90 రోజుల్లో కోర్టు ముందు లొంగిపోవాలి లేదంటే వారి తరఫున ప్రభుత్వ న్యాయావాదిని పెట్టి, తీర్పును ప్రకటించేలా సవరణ చేశారు..
మరోవైపు మహిళలకు ఈ-ఎఫ్ఐఆర్ నమోదు చేసుకునే అవకాశం.. అరెస్ట్ అయిన వ్యక్తి కుటుంబీకులకు సమాచారం ఇవ్వాలి దర్యాప్తు, సోదాల్లో వీడియోగ్రఫీ చేసేలా చట్టాల సవరణ జరుగుతోందని సమాచారం.. ఇదేగాక.. ఎవరైనా ఎక్కడి నుంచైనా జీరో ఎఫ్ఐఆర్ దాఖలు చేయవచ్చు.24 గంటల్లో దాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్‌కు మార్చుకోవచ్చని సమాచారం.. ఈ బిల్లు అమల్లోకి వస్తే.. నిరాధారంగా అరెస్ట్ చేసి పోలీస్టేషన్లో పెట్టుకోవడానికి వీలు లేదు..
ఇక ఆర్ధిక నేరస్తుల ఆస్తులను వేలం వేసి ప్రభుత్వ ఖజానాకు ఆ డబ్బును మల్లించే అవకాశం ఉన్నట్టు సమాచారం.. నేరం సందర్భంగా పట్టుకున్న వాహనాలను కోర్టు ద్వారా 30 రోజుల్లో అమ్మేయాలని.. పోలీస్ స్టేషన్స్ ఆధునీకరణ చేయాలని.. ఏడేళ్ల జైలుశిక్ష పడే కేసుల్లో ఫోరెన్సిక్ టీమ్స్ దర్యాప్తు తప్పనిసరి ఉండాలనే అంశాలు అమల్లో ఉంటున్నట్టు సమాచారం..