Telugu News » Bigboss : బిగ్‌బాస్ షోపై ముదురుతున్న వివాదం.. నాగార్జునపై ఫోకస్..!!

Bigboss : బిగ్‌బాస్ షోపై ముదురుతున్న వివాదం.. నాగార్జునపై ఫోకస్..!!

షో ముగిసిన అనంతరం బిగ్ బాస్ హౌస్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అరుణ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ రోజు రాత్రి జరిగిన గొడవపై రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఎక్కడా హీరో నాగార్జున పేరు చేర్చలేదని అరుణ్ తెలిపారు.

by Venu

బిగ్‌బాస్‌ (Bigboss) సీజన్‌ సెవెన్ (Season Seven) ముగిసింది. గ్రాండ్‌ ఫినాలే (Grand finale) నాడు జరిగిన రోజు కొందరు చేసిన రచ్చపై విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌పై (Pallavi Prashanth) జూబ్లీహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనతో పల్లవి ప్రశాంత్‌ కనపడకుండా వెళ్లిపోయాడు. అతని బదులుగా జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు లాయర్‌ను పంపించాడు.

ఫినాలే రోజు సెలెబ్రిటీల (Celebrities) అద్దాలు ధ్వంసం చేయడం.. ఆర్టీసీ బస్సు (Rtc Bus) అద్దాలు ధ్వంసం చేయడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న హీరో నాగార్జునను కూడా అరెస్ట్ చేయాలని కూడా హైకోర్టులో (High Court) పిటిషన్‌ దాఖలైంది. బిగ్‌బాస్‌ పేరుతో 100 రోజులు అక్రమంగా కొందరిని నిర్బంధిస్తున్నారని.. ఈ వ్యవహారంపై జోక్యం చేసుకొని నాగార్జునను అరెస్ట్ (Arrest) చేయాలంటూ అడ్వొకేట్ అరుణ్‌ (Arun) పిటిషన్‌ వేశారు.

బిగ్‌బాస్‌లో పాల్గొన్నవారిని కూడా విచారించాలని ఆ పిటిషన్‌లో కోరారు. ఆర్టీసీ బస్సు అద్దాలు చేయడం వెనుక ఉన్న కుట్రను బయటపెట్టేలా విచారణకు ఆదేశించాలని హైకోర్టును కోరారు. మరోవైపు బిగ్ బాస్ షోపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌కు సైతం ఫిర్యాదు అందింది. హైకోర్టు న్యాయవాది అరుణ్ ఇవాళ హెచ్ఆర్‌సీలో కంప్లైట్ చేశారు. సమగ్ర దర్యాప్తు చేయించాలని ఆయన కోరారు. బిగ్ బాస్ షో ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

షో ముగిసిన అనంతరం బిగ్ బాస్ హౌస్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అరుణ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ రోజు రాత్రి జరిగిన గొడవపై రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఎక్కడా హీరో నాగార్జున పేరు చేర్చలేదని అరుణ్ తెలిపారు. ఈ ఘర్షణలో హీరో నాగార్జునను సైతం బాధ్యులను చేసి, కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని న్యాయవాది అరుణ్ హెచ్ఆర్‌సీని కోరారు.

 

You may also like

Leave a Comment