Telugu News » America: కోతుల కోసం మినీ సిటీ.. 30వేల కోతుల పెంపకం..!

America: కోతుల కోసం మినీ సిటీ.. 30వేల కోతుల పెంపకం..!

అమెరికా(USA)లోని జార్జియా స్టేట్‌, బెయిన్‌బ్రిడ్జ్‌లో కోతుల కోసం ఏకంగా మినీ సిటీని ఏర్పాటు చేస్తున్నారు. సేఫర్‌ హ్యూమన్‌ మెడిసిన్‌(Safer Human Medicine)

by Mano
America: Mini city for monkeys.. Breeding 30 thousand monkeys..!

అమెరికా(USA)లోని జార్జియా స్టేట్‌, బెయిన్‌బ్రిడ్జ్‌లో కోతుల కోసం ఏకంగా మినీ సిటీని ఏర్పాటు చేస్తున్నారు. సేఫర్‌ హ్యూమన్‌ మెడిసిన్‌(Safer Human Medicine) కంపెనీ బెయిన్‌బ్రిడ్జ్‌లో 30వేల కోతులను పెంచేందుకు సిద్ధమైంది.

America: Mini city for monkeys.. Breeding 30 thousand monkeys..!

సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో పట్టణవాసులు ఆ కంపెనీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనావాసాల్లో కోతుల పెంపకంపై ప్రజలతోపాటు జంతు హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి.

అయితే, వీటిని వైద్య రంగంలో పరిశోధనల కోసం విశ్వవిద్యాలయాలు, ఫార్మాస్యుటికల్‌ కంపెనీలకు పంపిస్తామని సేఫర్‌ హ్యూమన్‌ మెడిసిన్‌ కంపెనీ చెబుతోంది. వీటి వల్ల ఈ ప్రాంతంలో వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తోంది.

అయినప్పటికీ స్థానికులు తీవ్ర నిరసన తెలుపుతున్నారు. దాదాపు 14వేల జనాభాగల ఈ పట్టణంలో 30వేల కోతులు ఉండటాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని తేల్చిచెబుతున్నారు. ఈ కంపెనీని తక్షణమే నిలిపేయాలని అధికారులను డిమాండ్‌ చేస్తున్నారు.

You may also like

Leave a Comment