Telugu News » America : అమెరికాలో కలవరపడుతున్న ఎన్నారైలు.. కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం..!

America : అమెరికాలో కలవరపడుతున్న ఎన్నారైలు.. కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం..!

ఈ ఘటనలకంటే ముందు ఓహాయోలోని సన్సినాటీ నగరంలోని శ్రేయాస్ రెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ మరణం వెనక ఉన్న కారణాలు ఇంకా తెలియరాలేదు.

by Venu

అమెరికా (America) పేరుకే పెద్ద దేశం కానీ ఇక్కడ భద్రత లేదనే భావనలో ఎన్నారైలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. ఈ దేశంలో భారత సంతతి వారిపై వరుసగా దాడులు (Attacks) జరగడం పరిపాటిగా మారింది. అయితే ఈ దాడులను ఖండిస్తున్నారు. కానీ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవడంలో విఫలం అవుతున్నట్లు ఆరోపణలున్నాయి.

ఈ నేపథ్యంలో శ్వేతసౌధం తాజాగా స్పందించింది. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొంది. అమెరికాలో జాతివివక్షకు, హింసకు తావు లేదని అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. ఈ మేరకు అమెరికా జాతీయ భద్రతా మండలిలోని స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ విభాగం కోఆర్డినేటర్ జాన్ కర్బీ (John Kirby) తాజా మీడియా సమావేశంలో ఈ విషయాలను పేర్కొన్నారు. భారతీయులపై జరుగుతున్న దాడుల గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలపై స్పందించిన ఆయన.. జాతి, ప్రాంతం, స్త్రీపురుష భేదాలు సహా మరే ఇతర కారణాలతో జరిగే దాడులైనా క్షమార్హం కాదని పేర్కొన్నారు.

ఈ దాడులను అరికట్టేందుకు బైడెన్ (Biden) ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ దాడుల కారకులకు కఠిన శిక్షలు పడేలా చేస్తామన్నారు. మరోవైపు ఫిబ్రవరి 2న అర్ధరాత్రి వాషింగ్టన్ డీసీలో జరిగిన దాడిలో 41 ఏళ్ల ఎన్నారై వివేక్ తనేజా దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.. మరో ఘటనలో హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ మజర్ అలీపై.. షికాగోలో ఫిబ్రవరి 4నకొందరు దాడి చేసి అతడి ఫోన్, వ్యాలెట్ దోపిడీ చేశారు.

ఈ ఘటనలకంటే ముందు ఓహాయోలోని సన్సినాటీ నగరంలోని శ్రేయాస్ రెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ మరణం వెనక ఉన్న కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇక జనవరి 30న అదృశ్యమైన పర్‌డ్యూ యూనివర్సిటీ విద్యార్థి నీల్ ఆచార్య కూడా మృతి చెందినట్టు నిర్థారించారు. మరోవైపు జార్జియాలో ఉన్న ఓ షాపులో ఆశ్రయం పొందుతున్న నిర్వాసితుడు జరిపిన దాడిలో షాపు ఉద్యోగి వివేక్ సైనీ కన్నుమూశాడు. ఇలా ఇండియన్లపై అకారణంగా వరుస దాడులు జరుగుతుండటంతో ఇక్కడి ఎన్నారైలు కలవరానికి గురవుతున్నారు.

You may also like

Leave a Comment