Telugu News » America : అమెరికాలో ప్లేగు కలకలం.. పదేళ్ల తర్వాత విజృంభణ..!

America : అమెరికాలో ప్లేగు కలకలం.. పదేళ్ల తర్వాత విజృంభణ..!

వ్యాధికి గురైన వ్యక్తిని అబ్జర్వేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వారు వెల్లడించారు. తీవ్ర జ్వరం, కళ్లు ఎర్రబడటం వంటి సమస్యలతో అతడు బాధపడుతోన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు పడిసంవత్సరాల తర్వాత ప్లేగు వ్యాధి కేసులు మళ్లీ నమోదు అవుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

by Venu

అమెరికా (America)లో ప్రాణాంతక ప్లేగు (Plague) వ్యాధి (Disease) మరోసారి కలకలం రేపుతోంది. దాదాపు పదేళ్ల తర్వాత ఈ వ్యాధి మళ్లీ విజృంభించడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా, సెంట్రల్ ఒరెగాన్‌ (Oregon) స్టేట్‌లో తొలి ప్లేగు పాజిటివ్‌ కేసు నమోదు అయ్యింది. ఈ వ్యాధి తన పెంపుడు పిల్లి నుంచి ఆ వ్యక్తికి సోకినట్లు యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవెంట్ తెలియచేసింది. దీనిని బ్యుబోనిక్ ప్లేగు (Bubonic Plague)గా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.

అయితే వ్యాధికి గురైన వ్యక్తిని అబ్జర్వేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వారు వెల్లడించారు. తీవ్ర జ్వరం, కళ్లు ఎర్రబడటం వంటి సమస్యలతో అతడు బాధపడుతోన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు పడిసంవత్సరాల తర్వాత ప్లేగు వ్యాధి కేసులు మళ్లీ నమోదు అవుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వ్యాధి నివారణకు సంబంధించిన చర్యలను వేగవంతంగా అమలుచేస్తున్నారు.

ఇక్కడి ప్రజలు ప్రాణాంతక ప్లేగు వ్యాధి పదేళ్ల తర్వాత మరోసారి విజృంభిస్తుండటంతో భయాందోళనలకు గురి అవుతున్నారు. ఇదిలా ఉండగా గతంలో అగ్రరాజ్యం అమెరికాను గడగడలాడించిన ప్లేగు వ్యాధి కేసులు చివరగా 2014 సంవత్సరం వరకు నమోదు అయ్యాయి. అమెరికాలోని న్యూ మెక్సికో, సదరన్ కొలరాడో, నార్తర్న్ అరిజోనా, కాలిఫోర్నియా, సదరన్ ఒరెగాన్, నెవడా రాష్ట్రాల్లో ఈ వ్యాధి విజృంభణ తీవ్రంగా ఉండేది.

ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు వ్యాధి నివారణకు వ్యాక్సిన్‌తో పాటు తగు జాగ్రత్తలు తీసుకొన్నారు. దీంతో అమెరికాలో ప్లేగు వైరస్ వ్యాప్తి నెమ్మదించింది. అప్పటి నుంచి ప్లేగు పాజిటివ్ కేసులు అమెరికాలో నమోదు కాలేదు. దీంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకొన్నారు.. కానీ దాదాపు పదేళ్ల తర్వాత తాజాగా మరోసారి ప్లేగు పాజిటివ్ కేసు నమోదు కావడం కలవరపాటుకు గురి చేస్తోంది. ఇది అదుపులోకి వస్తే ఫర్వాలేదు. లేదంటే మరోసారి ఇక్కడి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని అంటున్నారు..

You may also like

Leave a Comment