రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటెలే అని ఒక కవి అన్నారు.. ఎవరు అవునన్నా.. కాదన్నా.. లైఫ్ బండిని నడిపేది మాత్రం డబ్బు అని ఒప్పుకోక తప్పదు.. ఈ డబ్బు మీదే ఈ ప్రపంచం నడుస్తోంది. ఎందుకంటే ఆ డబ్బు లేకుంటే మనం ఎవరమో ఎవరికి అవసరం లేదు. ప్రస్తుత సమాజంలో మనిషి కంటే.. మనికే ఎక్కువ విలువ ఉందని ఎన్నో సంఘటనలు నిరూపించాయి..
ఇక ఒక మధ్య తరగతి వాడికి వేయిలు కూడబెట్టాలంటే జీవిత కాలం సరిపోదు.. ఇక లక్షలు.. కొట్లు ఎండమావులే.. అలాంటిది లాటరీలో కోట్ల కొద్ది డబ్బు వస్తే.. ఒక్క సారి ఊహించుకుంటే.. పానకం తాగినంత మధురంగా.. ఎండకాలం ఏసీలో కూర్చున్నంత హాయిగా అనిపిస్తుంది.. తాజాగా ఇలాంటి సంఘటనే అమెరికా (America)లో చోటు చేసుకొంది.. న్యూజెర్సీ(New Jersey)కి చెందిన ఒక వ్యక్తికి జాక్‌పాట్ తగిలిందని సమాచారం..
మెగా మిలియన్స్ అని పిలవబడే లాటరీ గేమ్‌లో అతను భారీ మొత్తం గెలుచుకొన్నాడు. లాటరీ అధికారులు నిన్న డ్రా తీయగా దానిలో ఒక వ్యక్తికి దాదాపు రూ.9,418 కోట్ల($1.13 బిలియన్ల) గెల్చుకున్నాడని గేమ్ అధికారులు ప్రకటించారు.. అయితే అతని వివరాలు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.. మరోవైపు జాక్‌పాట్ (Jackpot) చరిత్రలో ఇది ఐదవ అతిపెద్ద లాటరీ (Lottery) అని తెలుస్తోంది.
మరోవైపు లాటరీలో గెలిచిన విజేత ఈ మొత్తం అమౌంట్‌ను ఏకమొత్తంలో ఒకేసారి లేదా వార్షిక వాయిదాలలో 30 సంవత్సరాలకు పైగా పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. కాగా ఆగస్ట్ 8, 2023న ఫ్లోరిడాలో రూ.13,352 కోట్ల($1.602 బిలియన్ల) విలువైన జాక్‌పాట్‌ను విక్రయించారు. ఆల్ టైమ్ అమెరికాలో అతిపెద్ద లాటరీ జాక్‌పాట్ నవంబర్ 2022లో కాలిఫోర్నియాలో కొనుగోలు చేసిన టికెట్ ద్వారా రూ.17 వేల కోట్ల($2.04 బిలియన్ల)ను అందించినట్లు నిర్వాహకులు తెలిపారు..