Telugu News » Hyderabad : లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తాం.. జాతీయ బీసీ అనుబంధ సంఘాలు..!

Hyderabad : లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తాం.. జాతీయ బీసీ అనుబంధ సంఘాలు..!

బీసీలకు అండగా ఉంటున్న కాంగ్రెస్ పార్టీకే మా మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు.. త్వరలో 17 లోక్ సభ నియోజకవర్గాల వారిగా తమ అనుబంధ సంఘాల ప్రతినిధులు, బీసీలను ఏకం చేసి సమావేశాలు నిర్వహిస్తామని.. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామని అన్నారు..

by Venu

పార్లమెంట్ ఎన్నికల పోరు ఉత్కంఠంగా సాగానున్న నేపథ్యంలో.. తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ (Congress) పార్టీకి తమ పూర్తి మద్దతు ప్రకటిస్తామని జాతీయ బీసీ అనుబంధ సంఘాలు వెల్లడించాయి.. ఈ క్రమంలో త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికలలో (Lok Sabha Elections) బీసీలకు అండగా ఉంటున్న కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలిపారు.

నేడు జాతీయ బీసీ దళ్ దానికి అనుబంధ సంఘాలు, వివిధ విభాగాలు నాయకుల బృందం, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుడు వేం నరేందర్ రెడ్డిని కలిశారు.. వారికి మద్దతు ప్రకటిస్తూ లేఖను అందచేశారు.. కాగా ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల లోపే బీసీ కులాలకు 17 కార్పొరేషన్ లను ఏర్పాటు చేసిన ఘనత రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు సామాజిక ఆర్థిక కులగణనకు ముందుకు రావడం అభినందనీయమన్నారు..

రాష్ట్రంలో కులగణన చేపట్టడానికి ఉత్తర్వులు జారీ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అని, బీసీలు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా అన్ని రంగాలలో రాణించాలంటే కుల గణన చాలా ప్రాముఖ్యమైనదని కుమార స్వామి తెలిపారు. భవిష్యత్తులో బీసీలకు అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు తెలపడం ప్రభుత్వ చిత్త శుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు..

ఈ నేపథ్యంలో బీసీలకు అండగా ఉంటున్న కాంగ్రెస్ పార్టీకే మా మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు.. త్వరలో 17 లోక్ సభ నియోజకవర్గాల వారిగా తమ అనుబంధ సంఘాల ప్రతినిధులు, బీసీలను ఏకం చేసి సమావేశాలు నిర్వహిస్తామని.. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామని కుమారస్వామి తెలిపారు..

You may also like

Leave a Comment