తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల్లో నేతల మధ్య మాటల తుపాకులు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే ఎంఐఎం (AMIM)అధ్యక్షుడు అసదుద్ధీన్ ఓవైసీ.. టీపీసీసీ అధ్యక్షుడు (TPCC President) రేవంత్ రెడ్డి (Revanth Reddy) మధ్య విమర్శల యుద్ధం మొదలైంది. పొగపెట్టేలా ఉన్న రేవంత్ సంచలన వ్యాఖ్యలపై అసదుద్ధీన్ ఓవైసీ మంటలా మండిపడ్డారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ షేర్వాణీ కింద ఖాకీ నిక్కర్ ధరిస్తాడంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు అసదుద్ధీన్ కౌంటర్ ఇచ్చారు.
ఆర్ఎస్ఎస్ కీలు బొమ్మ అయిన రేవంత్ రెడ్డి.. మాపై చెప్పడానికి ఏమీ లేనప్పుడు మా బట్టల గురించి మాట్లాడటం సభ్యత అనిపించుకోదని అసదుద్ధీన్ మండిపడ్డారు. ఇలాంటి పాలిటిక్స్ ని డాగ్ విజిల్ పాలిటిక్స్ అంటారని అసదుద్ధీన్ ఓవైసీ (Asaduddin Oyic) ఎద్దేవా చేశారు. మరోవైపు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్.. రేవంత్ రెడ్డిని నియంత్రిస్తున్నాడని ఆరోపించారు.. ఇప్పటికీ రేవంత్ కు ఆ సంస్థతో అనుబంధం ఉందని అసదుద్ధీన్ ధ్వజమెత్తారు. పీసీసీ చీఫ్ ఆర్ఎస్ఎస్ సభ్యుడిగా చడ్డీ కట్టుకుని ఏబీవీపీకి వెళ్లి.. అక్కడి నుంచి టీడీపీలోకి.. ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చారు అంటూ విమర్శించారు.
మరోవైపు రేవంత్ రెడ్డి.. ఎంఐఎం అధ్యక్షుడు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ, అమిత్ షా సన్నిహితుడికి ఒవైసీ తన ఇంట్లో పార్టీ ఇచ్చారని ఆరోపించిన రేవంత్.. దీనిపై దర్గా దగ్గరికి రమ్మన్నా.. భాగ్యలక్ష్మీ టెంపుల్ కి రమ్మన్నా వచ్చి ప్రమాణం చేస్తానని వెల్లడించారు. మరి మసీదులో ప్రమాణం చేసేందుకు అసదుద్దీన్ ఒవైసీ రెడీనా అని రేవంత్ సవాల్ చేశారు.
అదీగాక అసదుద్దీన్ ఓవైసీ షేర్వానీ లోపల పైజామా ఉందనుకున్నానని.. కానీ ఖాకీ నిక్కర్ ఉందని అర్థమైందంటూ.. కేసీఆర్, మోదీ లాంటి దొంగలను కాపాడడానికి ఓవైసీ అబద్ధాలు చెప్తున్నారని రేవంత్ చేసిన వ్యాఖ్యలు వివాద స్పదంగా మారడంతో.. అసదుద్దీన్ మాటకు మాట సమాధానం ఇచ్చారు. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం మధ్య బిగ్ ఫైట్ నడుస్తోందని అనుకుంటున్న జనం.. ఓవైసీ బ్రదర్స్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం పెరుగుతోందని భావిస్తున్నారు.