Telugu News » amith sha: ఈ నెల 27న రాష్ట్రానికి అమిత్ షా!

amith sha: ఈ నెల 27న రాష్ట్రానికి అమిత్ షా!

తెలంగాణ(telagana) లో అధికారమే లక్ష్యంగా బీజేపీ(bjp) వ్యూహాలు రచిస్తోంది. ఎలాగైనా సీఎం కేసీఆర్​ను గద్దెదించాలని ప్రయత్నిస్తోంది.

by Sai
amit shah telangana visit schedule

తెలంగాణ(telagana) లో అధికారమే లక్ష్యంగా బీజేపీ(bjp) వ్యూహాలు రచిస్తోంది. ఎలాగైనా సీఎం కేసీఆర్​ను గద్దెదించాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే జాతీయ నేతలను రంగంలోకి దింపుతోంది.

amit shah telangana visit schedule

ఈ క్రమంలో జాతీయ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (amith sha) తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈనెల 27న అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది.

ఈ నెల 27న ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 1.25 గంటలకు గన్నవరం ఎయిర్​పోర్టుకు అమిత్ షా చేరుకుంటారు. గన్నవరం నుంచి హెలికాప్టర్ లో 2.10 గంటలకు కొత్తగూడెం వెళ్తారు. కొత్తగూడెం నుంచి రోడ్డు మార్గంలో భద్రాచలం పర్యటన. 2.25 నుంచి 2.40 గంటల వరకు భద్రాద్రి రాముడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

భద్రాచలం నుంచి రోడ్డు మార్గాన కొత్తగూడెం వెళ్తారు. కొత్తగూడెం నుంచి 2.55 గంటలకు బీఎస్ఎఫ్ హెలికాప్టర్​లో బయలుదేరి‌ 3.30 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. ఆ తరువాత 3.45 నుంచి 4.45 గంటల వరకు గంట పాటు రైతు గోస-బీజేపీ భరోసా సభలో పాల్గొంటారు.

బహిరంగ సభ తర్వాత గంట పాటు తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశం అవుతారు. సాయంత్రం 5.45 గంటలకు హెలికాప్టర్​లో తిరిగి గన్నవరానికి బయల్దేరాతారు. సాయంత్రం 6.20 గంటలకు ఢిల్లీకి తిరుగు ప్రయాణం

You may also like

Leave a Comment