కేంద్ర హోంమంత్రి(Central home minister) అమిత్ షా(Amith Shah) ఇవాళ తెలంగాణ(Telangana)లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో తెలంగాణలోని ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ కానున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.
అమిత్ షా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని, నేషనల్ పోలీస్ అకాడమీకి వెళ్తారు. రాత్రి అక్కడే బస చేసి రేపు నేషనల్ పోలీస్ అకాడమిలో నిర్వహించే పాసింగ్ ఔట్ పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అదేవిధంగా రేపు మధ్యాహ్నం సూర్యాపేటలో జనగర్జన సభలో అమిత్‌షా పాల్గొననున్నారు.
అమిత్‌షా పర్యటన షెడ్యూల్ ఇలా..
అమిత్‌షా ఉదయం 10.15గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఉదయం 10.20గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గం ద్వారా నేషనల్ పోలీస్ అకాడమిక్ చేరుకుంటారు. రాత్రికి పోలీస్ అకాడమీలో బస చేస్తారు.
27వ తేదీన(రేపు) అమిత్‌షా ఉదయం 8 గంటలకు నేషనల్ పోలీస్ అకాడమిలో పోలీస్ అమరవీరుల స్థూపానికి పుష్పగుచ్ఛాలతో శ్రద్ధాంజలి ఘటిస్తారు. అనంతరం 11గంటల వరకు ఐపీఎస్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.00గంటలకు భోజనం చేస్తారు. 2:35గంటలకు రోడ్డు మార్గం ద్వారా బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు బయలుదేరుతారు.
మధ్యాహ్నం 3:00 గంటలకు అమిత్‌షా ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి సూర్యపేటలో నిర్వహించే బీజేపీ జన గర్జన సభ ప్రాంగణానికి చేరుకుంటారు అమిత్‌షా. 3.55గంటల నుంచి 4.45గంటల వరకు ప్రసంగిస్తారు. అనంతరం సాయంత్రం 5గంటలకు సూర్యాపేట నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.