Telugu News » కోడలి పట్ల అత్తమామల దాష్టీకం!

కోడలి పట్ల అత్తమామల దాష్టీకం!

బాధితురాలి అత్త ఆమెను పట్టుకుని కత్తెరతో జుట్టు కత్తిరించింది

by Sai
an-atrocious-incident-of-a-woman-having-her-hair-cut-and-her-face-painted-black-was-paraded-in-a-village-in-congress-ruled-himachal-prades

హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలోని భోరంజ్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సమాజం సిగ్గుతో తల దించుకోవాల్సిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఓ వివాహిత జుట్టును కత్తిరించి, ముఖానికి నలుపు రంగు పూసి.. గ్రామంలో ఊరేంగించారు. ఈ అమానుష ఘటన వెలుగులోకి రావడంతో బాధితురాలి అత్తతో పాటు ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసులు మహిళను గుర్తించి, ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

an-atrocious-incident-of-a-woman-having-her-hair-cut-and-her-face-painted-black-was-paraded-in-a-village-in-congress-ruled-himachal-prades

ఈ ఘటన ఆగస్టు 31వ తేదీ సాయంత్రం జరిగినట్లు సమాచారం. శుక్రవారం వైరల్ వీడియోను పరిశీలించిన తరువాత, భోరంజ్ పోలీసులు బాధితురాలిని సంప్రదించి సంఘటన గురించి పూర్తి సమాచారాన్ని తీసుకున్నారు. కేసుకు సంబంధించిన సమాచారం అందుకున్న సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డా.ఆకృతి శర్మ, ఎస్‌హెచ్‌ఓ భోరంజ్ మాస్త్రం నాయక్ కూడా శుక్రవారం సాయంత్రం బాధితురాలి ఇంటికి చేరుకున్నారు.

బాధితురాలు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. ఆగస్టు 31న బాధితురాలు తన గ్రామానికి చేరుకున్నప్పుడు స్థానిక గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి తన ఇంటికి వచ్చారు. ఈ ముగ్గురు, ఆమె అత్తగారితో కలిసి బాధిత మహిళతో గొడవపడి దాడి చేశారు. బాధితురాలి అత్త ఆమెను పట్టుకుని కత్తెరతో జుట్టు కత్తిరించింది. అనంతరం ముఖానికి నలుపు రంగు పూశారు. అంతటితో ఆగకుండా ఆమెపై విచక్షణ రహితంగా దాడి చేసి.. చేతులు దుపట్టాతో కట్టి గ్రామానికి తీసుకెళ్లారు. ఈ సమయంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆమెను అడ్డుకుని చెప్పుతో కొట్టాడు.

మరోవైపు బాధితురాలికి తమ కుమారుడితో వివాహమైందని అత్తమామల తరఫు వారు ఆరోపిస్తున్నారు. అతనికి ఏడాది వయసున్న కూతురు కూడా ఉంది. పెళ్లయ్యాక కోడలు తరుచూ ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయేది. ఈ విషయమై భోరంజ్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ రిపోర్టు కూడా నమోదైంది. బాధితురాలిపై అత్తమామలు అనేక ఇతర ఆరోపణలు చేశారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు భోరంజ్ పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

హమీర్‌పూర్‌లో మహిళపై జరిగిన అమానవీయ ఘటనపై ప్రతిపక్ష నేత జైరాం ఠాకూర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన మానవాళికే సిగ్గుచేటని అన్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలకు తావు లేదు. ఇలాంటి మనస్తత్వానికి స్వస్తి పలకాలని అన్నారు. అటువంటి చర్యకు పాల్పడిన వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు. అందరికి కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేశారు.

You may also like

Leave a Comment