Telugu News » Anasuya : రాజకీయాల పై కామెంట్ చేసిన రంగమ్మత్త.. ఎంట్రీ దొరికిందా..!!

Anasuya : రాజకీయాల పై కామెంట్ చేసిన రంగమ్మత్త.. ఎంట్రీ దొరికిందా..!!

రజాకార్‌ మూవీ సాంగ్ విడుదల సందర్భంగా మేకర్స్ ఏర్పాటు చేసియాన ప్రెస్ మీట్ లో అనసూయ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాజకీయాల్లోకి ఎప్పుడొస్తున్నారనే ప్రశ్నకు స్పందిస్తూ, నాకు రాజకీయాలపై ఇంట్రెస్ట్ లేదని తెలిపింది.

by Venu

జబర్దస్త్ షో (Jabardast Show) తో ఫుల్ క్రేజ్ తెచ్చుకొన్న బుల్లితెర స్టార్ యాంకర్ (Anchor) అనసూయ (Anasuya) గురించి పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం జబర్దస్త్ షో మానేసి పూర్తిగా సినిమాలకే పరిమితమైంది. అయితే తాజాగా రంగమ్మత్త రాజకీయాల పై కామెంట్ చేసింది.

రజాకార్‌ మూవీ సాంగ్ విడుదల సందర్భంగా మేకర్స్ ఏర్పాటు చేసియాన ప్రెస్ మీట్ లో అనసూయ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాజకీయాల్లోకి ఎప్పుడొస్తున్నారనే ప్రశ్నకు స్పందిస్తూ, నాకు రాజకీయాలపై ఇంట్రెస్ట్ లేదని తెలిపింది. సేవ చేయడానికి రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదని, నటిగా కూడా సోషల్ సర్వీస్ చేయవచ్చని పేర్కొంది.

ఇప్పటి వరకు నాకెవరూ ఆఫర్‌ చేయలేదంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనసూయ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా బుల్లితెర, వెండితెర సెలబ్రిటీలు చాలామంది రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం కామన్. అలాగే అనసూయ కూడా రాజకీయాల్లోకి రావాలని ఉన్నా ప్రస్తుతం సినిమాల పై దృష్టి సారించింది. కానీ అవకాశం వస్తే పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చిన ఆశ్చర్య పడవలసిన అవసరం లేదు. ఇలా ఎంతమంది నటీ నటులు రాజకీయాలు వద్దని చివరకు ఎంట్రీ ఇచ్చిన సంఘటనలు చూశాం అనుకుంటున్నారు అనసూయ ఫ్యాన్స్..

You may also like

Leave a Comment