ఏపీ (AP) పాలిటిక్స్ రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి.. నేతలు పార్టీ మారుతున్న దృశ్యాలు ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలో పలు రాజకీయ వివాదాలకు కేరాఫ్ గా మారిన వైసీపీ (YCP) రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు (Raghurama Krishnam Raju) టీడీపీ (TDP)లో చేరారు. చంద్రబాబు సమక్షంలో పాలకొల్లు సభలో కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. అయితే, చంద్రబాబు ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ సభలో చంద్రబాబు (Chandrababu) మాట్లాడుతూ.. ఐదేళ్ల జగన్ పాలనలో ఏమైనా సాధించారా అని ప్రశ్నించారు. యువకుల జీవితాలను అంధకారం చేశారని మండిపడ్డారు. ఆయన పాలనలో అన్ని వర్గాలు నాశనం అయ్యాయని విమర్శలు గుప్పించారు..