Telugu News » Andhra Pradesh : రాష్ట్ర ఎన్నికల్లో గెలుపుకోసం జగన్ కొత్త నినాదం..తండ్రి బాటలో తనయుడు..!

Andhra Pradesh : రాష్ట్ర ఎన్నికల్లో గెలుపుకోసం జగన్ కొత్త నినాదం..తండ్రి బాటలో తనయుడు..!

ప్పటికే రాప్తాడు సిద్ధం సభ అనూహ్యమైన విజయం సాధించిందని భావించిన అధిష్టానం..త్వరలోనే పల్నాడులో మరో సిద్ధం సభను నిర్వహించడానికి సన్నాహాలు ప్రారంభించింది.

by Venu
ap cm ys jagan slams chandrababu pawankalyan nagari public meeting

ఏపీలో త్వరలో ఎన్నికలు ప్రారంభం అవనున్న నేపథ్యంలో పొలిటికల్ హిట్ ఇప్పటినుంచే పెరిగిపోతుంది. ఒకవైపు టీడీపీ (TDP), జనసేన (Janasena) ఒకే ఒరలో ఇమిడి పోయి.. వైసీపీ (YCP) ఓటమి లక్ష్యంగా పావులు కదుపుతుండగా.. సింహం ఎప్పుడు సింగిల్ అనే తీరుగా జగన్ వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇలా అనుకూల, ప్రతికూల రాజకీయాల మధ్య మరో కొత్త ఎత్తుకు జగన్ తెరతీశాడని అనుకొంటున్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వైఎస్‌ జగనే (YS Jagan) మళ్లీ ఎందుకు అధికారంలోకి రావాలంటే అనే నినాదంతో వైసీపీ ప్రజల్లోకి వెళ్లాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వైఎస్‌ జగన్‌ తిరిగి అధికారంలోకి వస్తేనే ఆ కార్యక్రమాలు ముందుకు సాగుతాయనే విషయాన్ని ప్రచారంగా ఉపయోగించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

అంటే కాకుండా టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే ఆ పథకాలు ఆగిపోతాయని కూడా ప్రజలకు చెప్పనున్నట్లు సమాచారం. మరోవైపు మూడు సిద్ధం సభలతో కార్యకర్తల్లో ఉత్సాహం నింపిన వైఎస్‌ జగన్‌ ఎన్నికల వ్యూహంపై సీనియర్‌ నాయకులతో సైతం చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాప్తాడు సిద్ధం సభ అనూహ్యమైన విజయం సాధించిందని భావించిన అధిష్టానం..త్వరలోనే పల్నాడులో మరో సిద్ధం సభను నిర్వహించడానికి సన్నాహాలు ప్రారంభించింది.

అదే విధంగా ఈసారి ఎన్నికల ప్రణాళికలో ఒకటి, రెండు తప్ప భారీ పథకాలను చేర్చకూడదని జగన్ అనుకుంటున్నట్లు చర్చ జరుగుతుంది. అయితే, రైతు రుణమాఫీ, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి పథకాలను ఎన్నికల ప్రణాళికలో చేర్చే అవకాశాలున్నట్లు టాక్ వినిపిస్తోంది. సామాజిక భద్రత పింఛన్‌ సొమ్మును సైతం పెంచే ఆలోచనలో ఉన్నారని సమాచారం.

మరోవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో 2004లో జరిగిన ఎన్నికల్లో ఎన్నికల ప్రణాళికను ఆయన ప్రకటించారు. ప్రజల కోసం అమలు చేసే వివిధ సంక్షేమ పథకాలను అందులో చేర్చారు. దాంతో కాంగ్రెస్‌ విజయం సాధించి, రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. 2009లో మాత్రం భారీ పథకాలను ప్రకటించలేదు. కాంగ్రెస్‌ (Congress) అధికారంలోకి వస్తే ఆ పథకాలు కొనసాగుతాయనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి విజయం సాధించారు. ప్రస్తుతం తన తండ్రి బాటలోనే జగన్ నడవనున్నట్లు సమాచారం.

You may also like

Leave a Comment