Telugu News » Andhra Pradesh : ఏపీ రాజధాని తిరుపతి.. ఎందుకంటే?.. మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!

Andhra Pradesh : ఏపీ రాజధాని తిరుపతి.. ఎందుకంటే?.. మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!

తిరుపతి రాజధానిగా మారితేనే సీమలో కరువు పోయి అభివృద్ధి జరగడం సాధ్యం అవుతుందని అన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీమకు నీళ్లు లేవు.. రాళ్లు మిగిలాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కాల జ్ఞానంలో తిరుపతి రాజధాని అవుతుందని బ్రహ్మంగారు రాసినట్లు గుర్తు చేశారు.

by Venu

రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) పలు విమర్శలు ఎదుర్కొంటుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో నెటిజన్స్ మిమ్స్ తో తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇలా ఏపీ రాజధానిపై పలు వాదనలు తెరపైకి వస్తున్నాయి.. ఈ క్రమంలో కాంగ్రెస్‌ (Congress) సీనియర్‌ నేత, మాజీ ఎంపీ చింతామోహన్‌ (Chinta Mohan).. ఈ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి (Tirupati) రాజధాని అవుతుంది, అవ్వాలని ప్రజలు కోరుతున్నారంటూ వెల్లడించారు..

తిరుపతి రాజధానిగా మారితేనే సీమలో కరువు పోయి అభివృద్ధి జరగడం సాధ్యం అవుతుందని అన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీమకు నీళ్లు లేవు.. రాళ్లు మిగిలాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కాల జ్ఞానంలో తిరుపతి రాజధాని అవుతుందని బ్రహ్మంగారు రాసినట్లు గుర్తు చేశారు. తిరుపతి అందరికీ ఆమోద యోగ్యమైన ప్రాంతం.. భూములు, వనరులు, ఆహ్లాదకర మైన వాతావరణం అన్నీ ఉన్నాయని చింతామోహన్‌ వెల్లడించారు.

ఇప్పటి వరకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మూడు రాజధానులు అని చెప్పి.. మళ్లీ హైదరాబాద్‌ (Hyderabad) ఉమ్మడి రాజధాని అనటం ఏంటని నిలదీశారు. స్వార్థ ఆర్ధిక ప్రయోజనాల కోసం హైదరాబాద్‌ను విడిచిన చంద్రబాబు.. తుళ్లూరు వచ్చారని విమర్శించిన చింతామోహన్‌.. వైసీపీ భూముల కోసం విశాఖపట్నం వెళ్లిందని ఆరోపించారు. వీరి స్వార్థ రాజకీయాల వల్ల ఏపీ ప్రజలు కష్టాలు పడుతున్నారని.. అభివృద్ధి లేక అల్లాడుతున్నారని మండిపడ్డారు..

అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ, తిరుపతి రాజధాని చేయాలని చెప్పినా.. సంజీవయ్య కర్నూలుకి పంపించారని గుర్తుచేశారు. ఆ తర్వాత రాజధాని హైదరాబాద్‌ వెళ్లిందని తెలిపారు. మరోవైపు తుళ్లూరు నుంచి విశాఖ వెళ్లిన ఏపీ రాజధాని.. ఇప్పుడు గాల్లో ఉంది అని ఎద్దేవా చేశారు. భ్రష్ఠు పట్టిన రాష్ట్ర రాజకీయాలు.. పాకిస్థాన్‌ పాలిటిక్స్ కంటే ఘోరంగా మారాయని ఫైర్‌ అయ్యారు. మళ్లీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కావాలని అన్నీ వర్గాలు కోరుతున్నట్లు పేర్కొన్నారు.

You may also like

Leave a Comment