Telugu News » AndhraPradesh : హీటెక్కిన ఏపీ రాజకీయాలు.. టీడీపీలో వైసీపీ కోవర్టులు..!?

AndhraPradesh : హీటెక్కిన ఏపీ రాజకీయాలు.. టీడీపీలో వైసీపీ కోవర్టులు..!?

టీడీపీలోకి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రావడాన్ని చాలా మంది నమ్మలేకపోయారు. కానీ టీడీపీలోకి వచ్చాక ఆయన తీరు చూస్తే… బాగా గాయపడి వచ్చాడని అర్థం చేసుకొని అడ్జస్ట్ అవ్వడానికి సిద్దమైనట్టు తెలుస్తోంది.

by Venu
ycp tdp war

ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైంది. తెలంగాణ (Telangana) రాజకీయాల మాదిరిగా అక్కడ కూడా రాజకీయాల్లో మార్పు జరుగనుందనే ఊహాగానాలు మొదలైయ్యాయి. ఈ క్రమంలో జగన్ (Jagan)పై ఉన్న వ్యతిరేకత వల్ల టీడీపీ (TDP) గెలుస్తుందనే భావనతో వలసలు మొదలైనట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఓటమిని జగన్ అంత సాధారణంగా స్వీకరించడని.. గెలుపు కోసం తన వ్యూహంలో తాను ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది.

ycp tdp war

ఈ క్రమంలో జగన్ పన్నిన వ్యూహంలో భాగంగా టీడీపీలోకి వలస వస్తున్నట్టు భావిస్తుండగా.. వారు వైసీపీకి కోవర్టులుగా ఉండే అవకాశాలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఎందుకంటే.. ఓ పార్టీకి అత్యంత విధేయుడు అనుకొన్న వారు కూడా గుడ్ బై చెప్పి ఇతర పార్టీల్లో చేరిపోతున్నారు. వారు కోవర్టులేమో అన్న అనుమానం చాలా మందికి ఉన్నట్టు తెలుస్తోంది. అయితే పార్టీలోకి వస్తున్న వారి వల్ల ఉపయోగం ఉంటేనే ప్రాముఖ్యత ఇవ్వాలని టీడీపీ అధినేత భావిస్తున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు టీడీపీలోకి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రావడాన్ని చాలా మంది నమ్మలేకపోయారు. కానీ టీడీపీలోకి వచ్చాక ఆయన తీరు చూస్తే… బాగా గాయపడి వచ్చాడని అర్థం చేసుకొని అడ్జస్ట్ అవ్వడానికి సిద్దమైనట్టు తెలుస్తోంది. ఇక ఎన్నికల ముందు పార్టీలు మారడం కామన్ పాయింట్.. కానీ వైసీపీలోకి వెళ్ళేవారు తక్కువగా ఉండటం.. టీడీపీ వైపు ఎక్కువగా మొగ్గుచూపడం ఆశ్చర్యకరంగా మారినట్టు చెప్పుకొంటున్నారు..

అదే సమయంలో టీడీపీ టిక్కెట్ లేదని చెప్పిన కేశినేని నాని, వైసీపీ (YCP)లో చేరారు. గతంలో ఆయన ప్రజారాజ్యంలో టీడీపీ కోవర్టుగా పని చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. కానీ ఆయన వ్యవహారశైలి చూస్తే.. ఏ పార్టీలో ఉన్నా అందరికీ కోవర్టుగానే కనిపిస్తారని అంటున్నారు. అయితే కోవర్టులుగా వచ్చినా పార్టీ అధికారంలోకి వస్తే ఒక్కరు కూడా దారి తప్పే అవకాశం లేదు.

కానీ.. ఒకవేళ ఏదైనా జరిగితే పార్టీలో ఒక్కరూ కూడా మిగలరనే భయం టీడీపీ వర్గాలలో ఉన్నట్టు టాక్.. అయితే ఇక్కడ వైసీపీ గెలుస్తుందన్న సెంటిమెంట్ కానీ నమ్మకం కానీ నాలుగైదు శాతం కూడా లేదనే అనుమానంతో టీడీపీలో ఉంటే చాలనుకొనే వారే ఎక్కువగా ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి..

You may also like

Leave a Comment