Telugu News » ఆర్సీబీ న్యూ కోచ్ గా ఆండీఫ్లవర్ కి పగ్గాలు..!

ఆర్సీబీ న్యూ కోచ్ గా ఆండీఫ్లవర్ కి పగ్గాలు..!

by sai krishna

బెంగుళూరు బెంగతీరినట్టే..రాయల్ ఛాలెంజర్స్ జ‌ట్టుకు కొత్త కోచ్ షురూ అయ్యాడు. ఆర్సీబీ పగ్గాలు జింబాబ్వే మాజీ క్రికెట‌ర్ ఆండీ ఫ్ల‌వ‌ర్‌ చేతికొచ్చాయి. 2024 ఐపీఎల్ సీజ‌న్ నుంచి బాధ్యతలు స్వీకరిస్తున్నట్టు సమాచారం.

ఆండీ ఇది వరకు ఇంగ్లండ్ టీమ్ కి కోచ్ గా కొనసాగాడు. ఐపీఎల్‌లో 2023 సీజ‌న్‌లో అత‌ను ల‌క్నో సూప‌ర్ గెయింట్స్‌ కు కూడా కోచ్‌గా వ్యవహరించాడు. అయితే ల‌క్నో జ‌ట్టు ఫ్ల‌వ‌ర్ స్థానంలో జ‌స్టిన్ లాంగ‌ర్‌ను హెడ్ కోచ్‌గా నియ‌మించింది.దీంతో ఆర్సీబీ కోచ్ ప‌ద‌వి కోసం ఆండీ ఫ్ల‌వ‌ర్ పోటీప‌డ్డారు.

కోచ్ ప‌ద‌వి కోసం ఫ్ల‌వ‌ర్ ప‌లు ఐపీఎల్ ఫ్రాంచైజీల‌తో చ‌ర్చించాడు.రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కోచ్‌గా వెళ్లేందుకు అత‌ను ప్ర‌య‌త్నించిన‌ట్లు తెలుస్తోంది. ప్రపంచ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న ప‌లు టీ20 టోర్నీల్లో కొన్ని జ‌ట్ల‌కు గ‌తంలో ఆండీ ఫ్ల‌వ‌ర్ కోచ్‌గా చేశారు. ల‌క్నోతో ఫ్ల‌వ‌ర్ రెండేళ్ల ఒప్పందం ముగిసింది.

You may also like

Leave a Comment