Telugu News » LOk sabha polls : తెలంగాణలో మరో సంచలన సర్వే రిపోర్టు.. ఎవరూ ఊహించని విధంగా ఫలితాలు!

LOk sabha polls : తెలంగాణలో మరో సంచలన సర్వే రిపోర్టు.. ఎవరూ ఊహించని విధంగా ఫలితాలు!

పార్లమెంట్ ఎన్నికల వేళ వివిధ సంస్థలు సర్వే(POlitical survey)లు నిర్వహించడం కామన్. అయితే, ఇదివరకు వెలువడిన ఫలితాలన్నీ అయితే, కాంగ్రెస్(Congress) లేదా బీజేపీ(BJP)కి అనుకూలంగా ఫలితాలను ప్రకటించాయి.

by Sai
Another sensational survey report in Telangana.. results that no one expected!

పార్లమెంట్ ఎన్నికల వేళ వివిధ సంస్థలు సర్వే(POlitical survey)లు నిర్వహించడం కామన్. అయితే, ఇదివరకు వెలువడిన ఫలితాలన్నీ అయితే, కాంగ్రెస్(Congress) లేదా బీజేపీ(BJP)కి అనుకూలంగా ఫలితాలను ప్రకటించాయి. కానీ, తెలంగాణలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా ఫలితాలు రాబోతున్నాయని, అందుకు రాష్ట్ర ప్రభుత్వంపై ఇప్పుడిప్పుడే ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తే కారణమని రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

Another sensational survey report in Telangana.. results that no one expected!

తెలంగాణలో నాలుగో విడతలో భాగంగా మే 13న లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎలాగైనా అత్యధిక సీట్లను సాధించాలని అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుస్తీలు పడుతున్నాయి.

ఈ ఎన్నికల్లో డబుల్ డిజిట్ స్థానాలు గెలుస్తామని అటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తుండగా.. బీఆర్ఎస్ మాత్రం ప్రచారంలో కాస్త వెనుకబడింది. ఈక్రమంలోనే కేసీఆర్ బస్సు యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లడం ప్రారంభించారు. దీంతో అంతా తారుమారు అయ్యిందని, ఎంపీ ఎన్నికల్లో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీని కాదని ఓటర్లు బీఆర్ఎస్‌కు జై కొట్టనున్నారని న్యూస్ 24 చానల్ సంచలన సర్వే రిపోర్టను వెల్లడించింది.

తెలంగాణ ప్రజల నాడి ఎలా ఉందో తెలుసుకునేందుకు న్యూస్ 24 ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించగా.. మెజార్టీ స్థానాలు పూర్తి భిన్నంగా, ఎవరూ ఊహించని విధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుందని సర్వే ప్రకటించింది. ఇక కాంగ్రెస్‌కు 2 స్థానాలు, బీజేపీకి 6 స్థానాలు, ఎంఐఎంకు ఒక స్థానం వస్తుందని ఈ సంస్థ సర్వే పేర్కొంది.కాగా, తెలంగాణలో నాలుగు నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోతుందని న్యూస్ -24 చానెల్ ప్రకటించగా.. ముందుగా చెప్పినట్లు బీఆర్ఎస్ ఓడిపోగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషేశం తెలిసిందే.

 

You may also like

Leave a Comment