Telugu News » AP Bhavan: ఏపీ భవన్ విభజన పూర్తి.. ముగిసిన పంచాయితీ..!

AP Bhavan: ఏపీ భవన్ విభజన పూర్తి.. ముగిసిన పంచాయితీ..!

ఏపీ భవన్ విభజనపై తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపడంతో లైన్ క్లియర్ అయ్యింది. దీంతో కేంద్ర హోం శాఖ అధికారంగా ఉత్తర్వులు జారీ చేసింది.

by Mano
AP Bhavan: The division of AP Bhavan is complete.. Panchayat is over..!

ఢిల్లీ(Delhi)లోని ఏపీ భవన్(AP Bhavan) విభజన పంచాయితీ ముగిసింది. ఏపీ భవన్ విభజనపై రెండు రాష్ట్రాలు అంగీకరం తెలిపాయి. ఏపీ భవన్ విభజనపై తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపడంతో లైన్ క్లియర్ అయ్యింది. దీంతో కేంద్ర హోం శాఖ అధికారంగా ఉత్తర్వులు జారీ చేసింది.

AP Bhavan: The division of AP Bhavan is complete.. Panchayat is over..!

ఏపీ భవన్‌లో తెలంగాణకు 8 ఎకరాల 24 గుంటలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు శబరి బ్లాక్ మూడెకరాలు, పటౌడి హౌజ్ ఐదెకరాల 24 గుంటలు కేటాయిస్తున్నట్లు  ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 11 ఎకరాల 53 గుంటల భూమిని కేటాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఐదెకరాల 78 గుంటల గోదావరి, స్వర్ణముఖి బ్లాక్‌లు కేటాయించింది. నర్సింగ్ హాస్టల్‌లో మూడెకరాల 35 గుంటలు, పటౌడి హౌజ్‌లో రెండెకరాల 39 గుంటల భూమిని కేటాయించింది. ఈ మొత్తం ప్రతిపాధనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఆంగీకారం తెలిపాయి.

రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కేంద్ర హోం శాఖ అధికారులను తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ మల్లు రవి ఇటీవలే కోరారు. కేంద్ర హోంశాఖ అధికారులతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర హోం శాఖ ఉత్తర్వులపై హర్షం వ్యక్తం చేశారు.

You may also like

Leave a Comment