Telugu News » AP : పశ్చిమ గోదావరి జిల్లాలో ఊపందుకొన్న ఎన్నికల ప్రచారం.. కీలక వ్యాఖ్యలు చేసిన పవన్-చంద్రబాబు..!

AP : పశ్చిమ గోదావరి జిల్లాలో ఊపందుకొన్న ఎన్నికల ప్రచారం.. కీలక వ్యాఖ్యలు చేసిన పవన్-చంద్రబాబు..!

అధికారం అంటే దోపిడీ అని జగన్ అనుకున్నాడు... ప్రజల ఆస్తులు దోచారు.. ప్రతిపక్షాలపై కేసులు, దాడులు జరిపించారని మండిపడ్డ బాబు.. స్వేచ్చగా ఓటు వేయండి..

by Venu

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారం ఊపందుకొంది. ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) వైసీపీ (YCP) టార్గెట్ గా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి అన్నీ మంచి రోజులే వచ్చాయని పేర్కొన్నారు.. రాష్ట్రాన్ని కాపాడుకోవటానికి మూడు పార్టీలు ఏకం అయ్యాయని తెలిపారు. జెండాలు వేరైనా అజెండా ఒక్కటేనన్నారు. జగన్ (Jagan) కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవటానికి సిద్ధమా ? అని అడిగారు..

TDP-Janasena: Discontent of leaders on TDP-Janasena first list..!!ప్రజల కోసం నిలబడిన నిజమైన హీరో పవన్ అని తెలిపిన బాబు.. నేను, తెదేపా ఎన్నటికీ ఆయన త్యాగాలను మర్చిపోమని పేర్కొన్నారు. మన సంకల్పానికి కేంద్రం సహాయం అవసరం ఉందని వివరించారు.. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు విజ్ఞప్తి చేస్తున్నా.. ఆనాడు 15కి 15సీట్లు ఈ జిల్లాలో గెలిపించారు.. ఇప్పుడు కూడా మళ్ళీ మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి.. అదేసీన్ ఇప్పుడు రిపీట్ చేయాలని అన్నారు..

వైకాపాకు డిపాజిట్లు కూడా రావు… రానివ్వకూడదన్న చంద్రబాబు.. మీరు కన్నెర్ర చేస్తే జగన్ లండన్ పారిపోతాడని ఎద్దేవా చేశారు.. 2014లో అధికారం ఇస్తే రాష్ర్ట అభివృద్ధికి ముందుకు వెళ్ళాం.. వందకు పైగా సంక్షేమ కార్యక్రమాలు అమలుచేశామని గుర్తు చేశారు.. జాబు రావాలంటే మళ్ళీ కూటమి రావాలన్న ఆయన.. కూటమి రావాలి అంటే మీరు 30 రోజులు పనిచేయాలని కోరారు..

జగన్ ఎన్నికల ముందు తలపై చెయ్యి పెట్టీ, బుగ్గలు నిమిరి, ముద్దులు పెట్టి ఇప్పుడు గుద్దులు గుద్దాడని ఎద్దేవా చేసిన బాబు.. ఇవాళ రాష్ర్టంలో విధ్వంసం సృష్టించాడని మండిపడ్డారు.. కొన ఊపిరితో ఉన్న రాష్ట్రానికి కేంద్రం ఆక్సిజన్ అందిస్తుందని తెలిపారు.. అలాగే రాజధాని నిర్మించాలన్న, పోలవరం పూర్తి కావాలన్న, యువతకు ఉద్యోగాలు రావాలని భావించినవన్నీ జరగాలంటే మోడీ సహకారం కావాలని వివరించారు..

సంక్షేమ పథకాలు కావాలో, సంక్షోభ పాలన కావాలో ఆలోచించండని సభలో పేర్కొన్నారు.. గంజాయి కావాలో ఐటీ పరిశ్రమలు కావాలో ఆలోచించండన్నారు.. పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచే వారు అవసరమా? అని ప్రశ్నించారు.. దళితులను చంపి డోర్ డెలివరీ చేసే నాయకులు కావాలా… దళితులకు పథకాలు అందించిన వారు కావాలో ఆలోచించండని సూచించారు..

గోనె సంచులు ఇవ్వలేని వ్యక్తి పౌర సరఫరాల శాఖ మంత్రి అని ఎద్దేవా చేసిన చంద్రబాబు.. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. రైతులను ఆదుకునే బాధ్యత మాదని తెలిపారు.. ప్రస్తుతం యువతకు డీఎస్సీ లేదు ఉద్యోగాలు లేవు.. మేము వస్తే మొదటి సంతకం మెగా డీఎస్సీ పైనే అన్నారు.. ఐదేళ్ల పాలనలో ఏ ఒక్కరూ బాగుపడలేదని విమర్శించిన ఆయన.. ఈ రాష్ట్రంలో బాగు పడింది జగన్ మోహన్ రెడ్డి మాత్రమే అని ఆరోపించారు..

అధికారం అంటే దోపిడీ అని జగన్ అనుకున్నాడు… ప్రజల ఆస్తులు దోచారు.. ప్రతిపక్షాలపై కేసులు, దాడులు జరిపించారని మండిపడ్డ బాబు.. స్వేచ్చగా ఓటు వేయండి.. భవిష్యత్తు కోసం ఆలోచించి ఓటు వేయండని కోరారు.. జగన్ ఒక నకిలీ వ్యక్తి అని ఆరోపించిన ఆయన.. ఎన్నికలకు ముందు ఇంటింటికీ తిరిగాడు.. రాష్ట్రాన్ని నిండా ముంచాడాని మండిపడ్డారు..

మేము నిర్దిష్ట అజెండాతో మీ ముందుకు వస్తున్నాం.. సూపర్ సిక్స్ ద్వారా ఆడవాళ్ళను ఆర్థికంగా పైకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.. ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, రైతులకు ఏడాదికి రూ.20 వేలు సహాయం, ఐదేళ్ళలో 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు.. మరోవైపు మరోసారి జగన్ వస్తే పరిశ్రమలు పారిపోతాయని చంద్రబాబు ఆరోపించారు..

బీసీలకు రక్షణ చట్టం తెస్తాం, పించన్లు ఇంటి వద్దకే తెచ్చి ఇస్తాం, 50ఏళ్లకే పింఛన్లు, వికలాంగులకు 6వేలు పింఛను అందిస్తామని హామీ ఇచ్చిన బాబు.. వాలంటీర్లు వ్యవస్థ ఇలాగే ఉంటుందన్నారు.. వీరికి జీతం 5 నుంచి 10వేలకు పెంచుతామని ప్రకటించారు.. మిమ్మల్ని చెడగొట్టాలని జగన్ చూస్తున్నాడంటూ మండిపడ్డారు.. టీడీఆర్ బాండ్ల రూపంలో ఇక్కడి మంత్రి రూ.850 కోట్లు కొల్లగొట్టాడని ఆరోపించారు..

ఇళ్ల స్థలాల పేరు చెప్పి ఒక్కో ఇంటికి రూ.30 నుంచి 40 వేలు కొట్టేశారని పేర్కొన్న టీడీపీ అధినేత.. పౌరసరఫరాల మంత్రి కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమంగా తరలించేస్తున్నారు.. ఇక్కడ వారాహి యాత్ర విజయవంతమైతే జనసైనికులపై దాడి చేయించారని మండిపడ్డారు.. ఆరోజు పవన్ కన్నెర్ర చేసుంటే మీరు ఎక్కడ ఉండేవారని ప్రశ్నించారు.. ఈ మంత్రి తడిసిన ధాన్యం కొనమంటే…రైతులను ఎర్రి పప్పలని దుర్భాషలాడారని తెలిపారు..

మరోవైపు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాట్లాడుతూ.. మా రోడ్ షో తో తాడేపల్లి ప్యాలస్ కంపించి పోయిందన్నారు.. ఎంతో చరిత్ర ఉన్న తణుకు.. జగన్ పాలనలో ఫ్యాక్షన్ కి చిరునామాగా మారిందని మండిపడ్డారు.. రైతులు ధాన్యం తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తే.. మంత్రి హేళనగా మాట్లాడారని గుర్తు చేశారు.. ఇక్కడ ఉన్న మన మంత్రులు బూతులు తిట్టేవారు, డ్యాన్సులు చేసే వాళ్ళని ఎద్దేవా చేశారు..

పోలవరం పూర్తి అయ్యిందా అంటే ఓ మంత్రి డ్యాన్స్ వేస్తాడని తెలిపిన పవన్.. తణుకు సీటు ప్రకటించాక కూడా నేను తగ్గి కూటమి కోసం ఇచ్చానని వివరించారు.. ఇదంతా రాష్ర్ట శ్రేయస్సు కోసమని తెలిపారు.. దోపిడీపై దృష్టి ఉన్న వాడు…సమస్యలపై ఏం ఆలోచిస్తాడని వ్యాఖ్యానించారు. మాకు అధికారం అవసరం లేదు… ఒక రైతు బాగుపడలన్నా… ఉద్యోగాలు రావాలన్నా మార్పు రావాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు..

రాష్ట్రంలో 70 వేల మంది పోలీసులకు టీఏ, డీఏలు లేవు అని తెలిపిన పవన్.. పోలీసుల శ్రమను దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు.. ఇక్కడ దోచేసిన డబ్బుతో… మంత్రి కారుమూరి తెలంగాణలో స్టీల్ ప్లాంట్ పెట్టారని ఆరోపించారు.. జగన్ అక్రమ కేసులు పెడితే చంద్రబాబు బెదరలేదని తెలిపిన జనసేనాని.. నేను ఇచ్చిన మాట కోసం తగ్గాను… ఎక్కడ నెగ్గాలో కాదు… ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడినని అన్నారు..

అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు అని తెలిపిన పవన్.. ఉద్దానం సమస్యను బాబు దృష్టికి తీసుకెళ్తే.. తక్షణం స్పందించినట్లు పేర్కొన్నారు.. ఆలాంటి వ్యక్తి రాష్ట్రానికి కావాలని సూచించారు.. ప్రజల ఆకాంక్షను దృష్టిలో ఉంచుకుని పొత్తు పెట్టుకున్నామని వివరించారు.. ఇక్కడున్న పౌరసరఫరాల మంత్రిని గోస్తని నదిలో కలిపేయాలని మండిపడ్డారు.. జనసైనికుల మీద పడిన దెబ్బమరచిపోనని తెలిపారు..

ఎక్కడికో వెళ్లి చదువుకోవడం, ఉద్యోగాలు చేయడం కాదన్న పవన్.. ఇక్కడే పరిశ్రమలు రావాలని అన్నారు.. మధ్య తరగతి మనుషులను మా కూటమి గుండెల్లో పెట్టుకుంటుందని పేర్కొన్నారు.. సీపీఎస్ చాలా కష్టమని తెలుసు… కానీ ఏడాది లోపు దీనికి పరిష్కారం చూపాలన్నారు.. అలాగే మధ్య తరగతి మనిషి బయటికి వస్తే తప్పక మార్పు తీసుకురావచ్చని తెలిపారు..

You may also like

Leave a Comment