Telugu News » Maharashtraమరాఠా కోటా ఉద్యమం..పోలీసులుకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం!

Maharashtraమరాఠా కోటా ఉద్యమం..పోలీసులుకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం!

నిరసనకారులు ఏ తప్పు చేశారని లాఠీచార్జి చేయాలని హోంమంత్రి ఫడ్నవీస్‌ ఆదేశించారు’ అని పేర్కొన్నారు.

by Sai
maratha quota stir in jalna turns violent police laticharge

మరాఠా రిజర్వేషన్ల ఉద్యమం రోజురోజుకి తీవ్ర రూపం దాల్చుతుంది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు(Reseravtions) కల్పించాలని రాష్ట్రంలోని జాల్నా జిల్లాలో గత కొద్ది రోజుల నుంచి సాగుతున్న ఉద్యమం తీవ్రమవుతుంది. శనివారం ఉద్యమం చేపడుతున్న నిరసనకారులు ఓ లారీకి నిప్పు పెట్టడంతో పాటు మరి కొన్ని వాహనాలను కూడా ధ్వంసం చేశారు.

maratha quota stir in jalna turns violent police laticharge

ఈ క్రమంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. దీంతో నిరసనకారులు రెచ్చిపోయారు. వారు పోలీసుల మీద రాళ్లు రువ్వడంతో జాల్నా ఎస్పీతో పాటు మరి కొంతమంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి తీవ్రంగా మారడంతో పోలీసులు గాలిలోకి రబ్బరు బుల్లెట్లను కాల్చారు.

ఈ ఘటన గురించి శివసేన నాయకుడు సంజయ్‌రౌత్‌ మాట్లాడుతూ ‘నిరసనకారులు ఏ తప్పు చేశారని లాఠీచార్జి చేయాలని హోంమంత్రి ఫడ్నవీస్‌ ఆదేశించారు’ అని పేర్కొన్నారు. ఎన్సీపీ నేత శరద్‌ పవార్‌ స్పందిస్తూ సమస్యను సామరస్యంగా పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు.

‘లాఠీచార్జి ఘటనపై దర్యాప్తునకు ఆదేశించాను’ అని సీఎం ఏక్‌నాథ్‌ షిండే ట్వీట్‌ చేశారు. జల్నాలో హింసకు పాల్పడ్డారని ఆరోపిస్తూ 360 మందిపై పోలీసులు కేసు నమోదుచేశారు.

You may also like

Leave a Comment