ఆంధ్రప్రదేశ్(Andrapadesh)లో ఇంటర్మీడియట్ ఫలితాలు ఇవాళ(శుక్రవారం) విడుదలయ్యాయి. ఉదయం 11గంటలకు విజయవాడ(Vijayawada)లోని తాడేపల్లి(Thadepally)లో ఇంటర్ బోర్డు కార్యాలయంలో బోర్డు కార్యదర్శి సౌరభ్‌గౌర్(Sourabh Gour) ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు.
ఈ సారి దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. అయితే, ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 67 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈసారి కూడా బాలికలదే హవా కొనసాగింది. ఫస్టియర్ పరీక్షలను 4 లక్షల మంది విద్యార్థులు రాయగా వారిలో 67శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అదేవిధంగా సెకండియర్ పరీక్షలు 3 లక్షల మంది రాయగా 78శాతం మంది విద్యార్థులు పాసయ్యారు.
ఒకేషనల్ పరీక్ష రాసిన 38 వేల మందిలో 71శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలితాల్లో కృష్ణా జిల్లా ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. ఫస్టియర్‌లో 84 శాతం, సెకండియర్‌లో 90శాతం ఉత్తీర్ణత సాధించారు కృష్ణా జిల్లా విద్యార్థులు. 81 శాతంతో గుంటూరు జిల్లా రెండవ స్థానంలో నిలిచింది.
ఈ సందర్భంగా ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ మాట్లాడుతూ.. బాలికల ఉత్తీర్ణత శాతం బాలుర కంటే ఎక్కువగా ఉందన్నారు. ఇదే సమయంలో ఫెయిల్ అయిన విద్యార్థులు తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని కోరారు. ఫెయిల్ అయ్యారంటూ పిల్లలను తల్లి తండ్రులు అవమానించవద్దని సూచించారు. వారికి సపోర్ట్‌గా నిలవాలన్నారు. సప్లిమెంటరీ పరీక్షలు బాగా రాసి మంచి ఫలితాలు రాబట్టాలన్నారు.