ఆంధ్రప్రదేశ్ (AP) ముఖ్యమంత్రి (CM) వైఎస్ (YS) జగన్‌మోహన్‌రెడ్డి (Jagan Mohan Reddy)పై అక్రమ ఆస్తుల కేసు ఉన్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలో సుప్రీంకోర్టు జగన్ పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్‌తో పాటు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చింది. అయితే ఈ కేసుల పంచాయితీ ఇప్పటి వరకు తెగడం లేదు.. ఈ నేపథ్యంలో నరసాపురం ఎంపీ రఘురామ (MP Raghurama) కృష్ణంరాజు (Krishna Raja) జగన్ కేసుల విషయాన్ని ఇప్పటికి వదలడం లేదు.
మొన్నటి దాకా జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ కోర్టుల్లో పిటిషన్లు వేశారు. ఇది వర్కవుట్ అవడం లేదం భావించిన రఘురామ తన రూటు మార్చారు. బెయిల్ రద్దు చేయాలన్న అంశాన్ని పక్కనబెట్టి.. జగన్‌పై ఉన్న కేసుల విచారణ వేగవంతం చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అది చాలదన్నట్టు తాజాగా జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను హైదరాబాద్ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌లో కోరారు.
తెలంగాణ సీబీఐ కోర్టులో జగన్ కేసులపై జాప్యం జరుగుతోందని రఘురామ పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా ఈ కేసులను ఇప్పటికే సీబీఐ కోర్టు 3,071 సార్లు వాయిదా వేసిందని ఎంపీ ఆరోపించారు.. జగన్ ప్రత్యక్షంగా హాజరుకాకుండా సీబీఐ కోర్టు మినహాయింపు ఇవ్వడం సరికాదని తెలిపారు..
రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పౌరయుద్ధం తప్పదేమోనన్న అనుమానం వస్తోందని ఎంపీ అన్నారు. ఇప్పటికీ వందల కొద్దీ డిశ్చార్జి పిటిషన్లు వేశారు. డిశ్చార్జి పిటిషన్లతో కేసు విచారణ జాప్యం జరిగే అవకాశం ఉంది అని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా శుక్రవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ భట్టి ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరపనుంది..