లిక్కర్ పాలసీ కేసు(The Liquor Policy Case)లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(Delhi CM Kejriwal)కు మరోసారి ఈడీ(ED) నోటీసులు జారీ చేసింది. ఈనెల 19న హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. ఇప్పటికే కేజ్రీవాల్‌కు ఐదుసార్లు ఈడీ నోటీసులు ఇచ్చింది. అయినా ఆయన ఇప్పటి వరకు విచారణకు హాజరుకాలేదు.
ఇలా దాదాపు ఐదుసార్లు మొండికేశారు కేజ్రీవాల్. నోటీసులు జారీ చేసిన ప్రతీసారి డుమ్మాకొడుతూనే ఉన్నారు. దీంతో ఈడీ అధికారులు కోర్టును ఆశ్రయించగా విచారణకు కేజ్రీవాల్ సహకరించాలని కోర్టు సూచనలు చేసింది. దీంతో లిక్కర్ పాలసీ కేసులో మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది.
ఇదివరకు 2023 నవంబర్ 2, డిసెంబర్ 21, 2024 జనవరి 3, జనవరి 18, ఫిబ్రవరి 2 తేదీల్లో ఈడీ కేజ్రీవాల్‌కు సమన్లు పంపింది. తాజాగా మరోసారి బుధవారం నోటీసులు ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికల ముందు ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని ఆప్ తప్పుపడుతోంది.
అయితే ఇప్పటికైనా ఈడీ నోటీసులకు కేజ్రీవాల్ స్పందిస్తారో లేదో చూడాల్సిందే. లిక్కర్ పాలసీ కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తీహార్ జైల్లో ఉన్నారు. పలుమార్లు ఆయనకు కోర్టు బెయిల్ నిరాకరించిన ఇటీవల వివాహ కార్యక్రమం నిమిత్తం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.