పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు తెలంగాణ(Telangana)లోని ప్రధాన పార్టీలు ప్రచారంలో తలామునకలయ్యాయి. ఈ క్రమంలోనే ఎంఐఎం(MIM) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(Mp Asaduddin Owaisi) మరోసారి కేంద్రంలోని బీజేపీ సర్కారును, ప్రధాని మోడీ(PM MODI)పై విమర్శనాస్త్రాలు సంధించారు.
ఉత్తరాదిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ ముస్లిం జనాభా పెరుగుదల గురించి చేసిన వ్యాఖ్యలకు అసదుద్దీన్ మంగళవారం కౌంటర్ ఇచ్చారు.‘ముస్లింలు ఎక్కువ మంది పిల్లలను కంటున్నారని మోడీ అంటున్నారు. మరి మీకు ఆరుగురు అన్నదమ్ములు లేరా అని ప్రశ్నించారు. అలాగే రవిశంకర్ ప్రసాద్‌కు ఏడుగురు అన్నదమ్ములు లేరా? అమిత్ షాకు ఆరుగురు అక్కాచెళ్లెళ్లు లేరా? అని ప్రశ్నించారు.
మోడీ ప్రసంగం చూస్తుంటే ఆయన దేశప్రధానిగా మాట్లాడటం లేదని, హిట్లర్ మాట్లాడుతున్నట్లు ఉందని ఎద్దేశా చేశారు. ప్రధాని వ్యాఖ్యలు శోభను ఇవ్వవని అన్నారు. తాము ఎవరి ఆస్తులను దోచుకున్నామో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇంటర్ జనరేషనల్ మొబిలిటటీ ప్రకారం తాత రూ.100 సంపాదిస్తే మనవడు రూ.110 సంపాదించాల్సి ఉంటుందని ఆయన అసదుద్దీన్ చెప్పారు . మోడీ ముస్లిం జనాభా గురించి మాట్లాడటం కంటే లఢక్‌లో చైనా వేసి టెంట్లపై మాట్లాడాలని సెటైర్ వేశారు.దేశ సరిహద్దుల్లో ముస్లింలు అక్రమంగా చొరబడుతున్నారని మోడీ అంటున్నారు మరి అప్పుడు మీరేం చేస్తున్నారు కుర్చీ వేసుకుని చాయ్ తాగుతున్నారా? అని ఎంపీ అసద్ విమర్శించారు.